Nayanatara : గతంలో పెళ్లైతే హీరోయిన్‌ల కెరీర్ క్లోజ్ అయ్యేది. ఏ సోదరి పాత్రతోనో.. తల్లి పాత్రలకో పరిమితం కావాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. పెళ్లైనా కొందరు ముద్దుగుమ్మలకు డిమాండ్ తగ్గడం లేదు. వారి క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ముద్దుగుమ్మలు సైతం రెమ్యునరేషన్ పెళ్లి కంటే ముందు ఉన్నదానికి దాదాపు డబుల్ వసూలు చేస్తున్నారని టాక్. తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అమ్మడు పెళ్లి తర్వాత తన 75వ సినిమాను చేయబోతోంది. ఈ సినిమాకు అమ్మడు డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ విని అంతా అవాక్కవుతున్నారు.
Nayanatara : కోలీవుడ్ చిత్రంతో ఎంట్రీ..
సంచలనాలకు బ్రాండ్ అంబాసిడర్ నయనతార. తన పేరును ఆమె నిజంగానే సార్ధకం చేసుకుంటోంది. ఆమె నటిస్తున్న 75వ చిత్రానికి ఏకంగా రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. పెళ్లికి ముందు ఆరు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నయన్.. వివాహానంతరం ఏకంగా 10 కోట్లకు పెంచేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయ్యా అనే కోలీవుడ్ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే మంచి విజయం అందుకున్నారు. ఆ తరువాత నటించిన గజిని, చంద్రముఖి ఇలా వరుసగా భారీ విజయాన్ని అందుకోవడంతో అమ్మడు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది.
ఈ ముద్దుగుమ్మ తాజాగా బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. అట్లీ దర్శకత్వంలో షారూఖ్‌ఖాన్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. కెరీర్ బిగినింగ్ నుంచే స్టార్ హీరోలతో నటిస్తూ.. వారికి సమానంగా పారితోషికం నయన్ అందుకుంటోంది. తొలుతు 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ మధ్య తన రెమ్యూనరేషన్‌ను 6 కోట్లకు పెంచేసిందని కోలీవుడ్ టాక్. ఇప్పుడు ఏకంగా రూ.10 కోట్లకు తన రెమ్యూనరేషన్‌ను పెంచేసిందని టాక్. ఇక బాలీవుడ్‌లో కూడా సక్సెస్ అయితే అమ్మడిరెమ్యునేషన్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించడం కాసింత కష్టమే.