ఇటీవలే బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ రూపంలో హాట్రిక్ విజయం అందుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ మరో మాస్ జాతరకు రెడీ అయ్యిపోయారు. ఈ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని సెట్స్‌పై పరుగులు పెడుతున్నారు. బాలకృష్ణ కెరీర్‌లో 107 సినిమాగా ఈ మూవీ రూపొందిపోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై శరవేగంగా పనులు నడుస్తుండగా తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సినిమా పట్ల ఆసక్తి మరింత రెట్టింపు చేశారు మేకర్స్.
NBK 107 అంటూ సినిమా పేరు ప్రకటించకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ రెలీజ్ చేసారు. అయితే ఈ పోస్టర్‌లో బాలకృష్ణ పవర్‌ఫుల్ లుక్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. బ్లాక్ లుంగీతో మాస్ ట్రీట్ ఇచ్చారు బాలయ్య. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. ఈ లెజెండ్‌తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. అంతేకాదు ఇది మొదలు మాత్రమే.. ముందు ముందు సింహం వేట మామూలుగా ఉండబోదు అని మాటిచ్చారు.