NBK – PSPK – Unstoppable : ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో మరే షో సొంతం చేసుకోలేని రికారడ్స్ను క్రియేట్ చేస్తూ మ్యాజిక్‌ను క్రియేట్ చేస్తోంది అన్‌స్టాపబుల్ షో. తనదైన స్టైల్ యాంకరింగ్‌తో, భాషా నైపుణ్యంతో, చలోక్తితో, షో ను రసవత్తరంగా నడిపిస్తూ ఓటీటీలో దడదలాడిస్తున్నాడు బాలయ్య. ఇప్పటి వరకు తెరమీద కనిపించని ఎంతో మంది స్టార్స్‌ను స్క్రీన్ పైన చూపించి వారి వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేశారు బాలయ్య. ఈ మధ్యకాలంలో ఈ షోకు వచ్చిన రెస్పాన్స్ , ఫాలోయింగ్ మరే షోకు లేదంటే అతిశయోక్తి కాదు. మొదట్లో బాలయ్య షో చేస్తున్నాడంటే అందరూ అవక్కయ్యారు…ఇప్పుడేమో బాలయ్య నెక్ట్స్ షో ఎవరితో అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

అయితే ఇంత వరకు బాలయ్య చేసింది ఓ లెక్క…ఇప్పుడు మరోలెక్క. గతం కొంత కాలంగా సోషల్ మీడియాలో పవర్ స్టార్‌తో బాలయ్య అన్‌స్టాపబుల్ ఎపిసోడ్‌కు సంబంధించిన వార్తలతో దద్దరిల్లిపోతోంది. బాలయ్య, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ షోకు సంబంధించి ఆహా యూట్యూబ్‌లో విడుదల చేసిన చిన్న చిన్న క్లిప్పులు కూడా క్షణాల్లో వైరల్ అయ్యాయి అంటే వీరిద్దరి కాంబినేష్ ఏ లెవెల్లో అర్ధం చేసుకోవచ్చు. మరి ఇన్నాళ్లు ఈ ఇంటర్వ్యూ గురించి ఊరించిన ఆహా తాజాగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమో1ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట్లో సునీమిని సృష్టిస్తోంది.

ఇక ప్రోమోలోకి వెళిపోతే ఈశ్వరా పవనేశ్వరా అంటూ బాలయ్య పవన్ ఎంట్రీని స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్లో నేను మీకు తెలుసు, నా స్థానం మీ మనసు అంటూ అభిమానులను అలరించారు. బాలయ్య గుడుంబశంకర్ సినిమాలో బ్రదర్ నువ్వు ప్యాంటు మీద ప్యాంటు వేశావు. అప్పుడు 25 ఏళ్లు తగ్గావు తెలుసా.. అని అనగానే పవన్ నవ్వుల పువ్వులు పూయించారు. ఇలా ఇంటర్వ్యూ మొత్తం బ్రదర్ బ్రదర్ అంటూ రాజకీయాలకు అతీతంగా ఎంతో ఫ్రెండ్లీగా కొనసాగించారు బాలయ్య. మనం మొదట ఎక్కడ కలిసామో తెలుసా అని బాలయ్య అడిగారు. ఓ పిక్ ను చూపించి అప్పుడు నేను కుర్రాడిలా ఉన్నాను కదా అని అనగానే… ఇప్పటికీ అలాగే ఉన్నారంటూ పవన్ ఫన్ చేశాడు. త్రివిక్రమ్ నువ్వు మంచి ఫ్రెండ్స్ కదా అని అన్నారు బాలయ్య, ఈ ప్రశ్నకు అవును ఫ్రెండ్స్ అవ్వాల్సి వచ్చింది అని అన్నారు పవన్. బ్రదర్ అంటూ బాలయ్య పవన్‌ను..సాయంత్ర పూట కలవాలంటే అని అనగానే పవన్ అంటే 4 తరువాతా లేదా 6 తరువాతా అంటూ కామెడీ చేశారు. ఈ ఆన్సర్‌కి అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ పడిపడి నవ్వారు. ఇక
రామ్‌చరణ్ నీకు ఎలా క్లోజ్ అయ్యాడు. అని అనాగానే చిన్నప్పుడు వాళ్ల డ్యూటీ నేనే చేసేవాడిని అని అన్నాడు పవన్. నేను ఇంట్లో వారికి దొరికిపోయేవాడిని అని చెప్పుకొచ్చాడు..ఆ తరువాత అవును క్లోజ్ అవ్వాల్సి వచ్చింది అని అన్నారు..ఇక్ రామ్ చరణ్‌కి కాల్ కలిపి ఇతనో ఫిట్టింగ్ మాస్టర్ అని అన్నారు బాలయ్య. సాటి హీరోగా అడగటం లేదు నీకు అమ్మ అంటే భయమా లేదా మీ ఆవిడ అంటే భయమా అని అడిగారు దానికి ఓ నవ్వు వేసుకున్నాడు పవన్.

ఆ తరువాత మెగా యువ నటుడు సాయి ధరమ్ తేజ్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు. హారర్ సినిమాలకు అమ్మాయిలకు పెద్దగా తేడా లేదని నవ్వులు పూయించాడు తేజ్. ఆఖరికి అమ్మాయిలను ఎలా గౌరవించాలో ఆయనే నేర్పిస్తారు అంటూ తేజ్ అనగానే పవన్ ఏంటీ ఏంటీ అని అంటారు. బాలయ్య తొడ కొట్టు అని అడగ్గానే ఆయన దగ్గరికే వెళ్లి ఆయన తొడగొట్టడానికి ప్రయత్నిస్తాడు. దీనితో అక్కడ పెద్ద ఎత్తున ఫన్ క్రియేట్ అయ్యింది. ఇక అప్పటి వరకు నవ్వులతో నిండిపోయిన ఇంటర్వ్యూ సడెన్ గా సీరిస్ మ్యాటర్‌ను మొదలు పెట్టారు బాలయ్య. బ్రదర్ ఈ పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా అని అడగ్గానే, వారు బాధపడతారనే నా విజ్ఞతతో మాట్లాడటం లేదన్నారు. నా సంస్కారం ఆపేస్తోందన్నారు పవన్. మానసిక సంఘర్షణకు గురైన పవన్ కల్యాణ్ , పవర్ స్టార్ ఎలా అయ్యాడు అని బాలయ్య మరో ప్రశ్న వేశారు. దీనికి అన్నయ్య రూమ్‌లోకి వెళ్లి పిస్టల్ తీసుకుని అని సస్పెన్స్‌లో వదిలేశారు పవన్ . వాచ్ అన్‌స్టాపబుల్ ఆన్ ఆహా అంటూ తనదైన స్టైల్ లో చెప్పి ఆడియన్స్‌ను అలరించారు. దీంతో ఇంటర్వ్యూ మంచి రసవత్తరంగా ఉంటుందంటూ ప్రోమో ద్వారా అర్ధమవుతోంది. పవన్ బుల్లితెరపై సందడి చేయడం ఖాయంగా తెలుస్తోంది. మరి ఫిబ్రవరి 3 వ తారీఖున ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ కానుంది. ఈ మధ్యలోనే ప్రోమో 2ను విడుదల చేయనుంది ఆహా టీమ్.