నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. బాలకృష్ణ నటిస్తోన్న 107వ సినిమా ఇది. తెలంగాణలోని సిరిసిల్లలో షూటింగ్ ను మొదలుపెట్టారు. NBK 107 షూటింగ్ మొదలు అయ్యింది సరే!. మరి బాలకృష్ణ సెట్స్‌లోని వారిని చితక్కొడుతున్నారా ? ఏంది అని అనుకోకండి. అసలు విషయానికి వస్తే NBK 107 షూటింగ్‌ను యాక్షన్ సన్నివేశాల షూటింగ్ తోనే ప్రారంభించారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్, లక్ష్మణ్ మాస్టర్స్ ఈ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
NBK 107లో భారీ యాక్షన్ షాట్స్ ఉంటాయి. మేకింగ్‌లో ఎలాంటి కాంప్రమైజ్డ్ లేకుండా సినిమాను రూపొందించాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అఖండ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన బాలకృష్ణ తదుపరి సినిమా ఇదే. అలాగే క్రాక్ సినిమా తో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న చిత్రమిది. నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని, బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్లు గోపీచంద్ మలినేని కథాంశాన్ని రూపొందించారు.
సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఈ చిత్రంలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్‌లో కనిపించబోతున్నారని సమాచారం. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్‌గా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సినిమాను నిర్మిస్తుంది. అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ చేస్తోన్న సినిమా కావడంతో NBK 107పై భారీ అంచనాలతో ఉన్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.