Bigboss 6 : తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికి ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక ప్రేక్షకులందరూ బిగ్ బాస్ సీజన్ 6 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఆసక్తికి తగ్గట్టుగానే త్వరలోనే సీజన్ 6 కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక పూర్తైంది. వారి పేర్లు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి వైరల్ అవుతున్న లిస్ట్‌లో ఎంత మంది ఉంటారో.. ఎంతమంది ఉండరో తెలియదు కానీ.. ఊహాగానాలు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే తొలుత రిలీజైన బిగ్‌బాస్ లోగో ఆకట్టుకోగా.. తరువాత విడుదల ప్రోమో మాత్రం నెట్టింట పెద్ద చర్చకే దారి తీసింది.
ఈ మధ్యనే నాగర్జున బిగ్ బాస్ సీజన్ 6 గురించి అధికారికంగా ప్రకటించి ఈ సీజన్లో కామన్ పీపుల్ కి కూడా చోటు ఉండబోతోంది అని క్లారిటీ ఇచ్చారు. ఇక తాజాగా మరొక ప్రోమోతో అందరి ముందుకు వచ్చారు నాగార్జున. ఈ ప్రోమోను పెళ్లిలో అప్పగింతల కాన్సెప్ట్‌తో డిజైన్ చేశారు. అప్పగింతల సమయంలో ఉన్నట్టుండి అమ్మాయి తల్లిదండ్రులు మాయమైపోతారు. అమ్మాయి తన తల్లిదండ్రులు ఏమై పోయారా? అని వెదుక్కుంటూ ఉంటుంది. అప్పుడే నాగార్జున ఎంట్రీ ఇచ్చి అప్పగింతల అయ్యేవరకు ఆగలేకపోయారంటే అక్కడ ఆట మొదలైనట్టే అంటూ బిగ్ బాస్ సీజన్ 6 త్వరలోనే మొదలు కాబోతున్నట్లుగా ప్రకటించారు.
Bigboss 6 : అప్పగింతల సమయంలో మాయమైపోవడమేంటి?
ఈ ప్రోమోనే రచ్చకు దారి తీస్తోంది. కూతురి అప్పగింతల కంటే షో ముఖ్యమనే సందేశాన్ని ఇస్తున్నారా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. తల్లిదండ్రులకు కూతురి వివాహం, ఆ వివాహంలో జరిగే ప్రతి తంతూ చాలా ముఖ్యమని.. ప్రధానంగా అప్పగింతలు జరుగుతుండగా ఎలా మాయపోతారని.. ఈ కాన్సెప్ట్ డిజైన్ చేసిన వారిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రోమో అనేది ఒక క్రియేటివ్ థాట్‌తో చేసేదని.. దీనికి అంత రచ్చ అవసరం లేదని అనేవారూ లేకపోలేదు. మొత్తానికి ప్రోమోతో బిగ్‌బాస్ నిర్వాహకులు పెద్ద చర్చకే తెరదీశారు. కాగా.. ఈ షో సెప్టెంబర్ 4న సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుందని తెలుస్తోంది.