New Delhi : ఢిల్లీలో జరిగిన నిక్కీ యాదవ్ మర్డర్ కేసులో తవ్వే కొద్ది నిజాలు బయట పడుతున్నాయి. మొదట నిక్కీ, సాహిల్ ఇద్దరూ కూడా సహాజీవనం చేసినట్లు అందరూ భావించారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకునేందుకే ప్రియురాలిని చంపి ఉంటాడని అందరూ అనుమానించారు. కానీ సాహిల్ గెహ్లాట్, నిక్కీ యాదవ్ 2020 అక్టోబర్‌లో నోయిడాలోని ఆర్యసమాజ్ మందిర్‌లో రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. 24 ఏళ్ల హత్య కేసులో గెహ్లాట్ తో పాటు అతని తండ్రితో సహా నిక్కీని చంపడానికి కుట్రలో ఉన్న ఐదుగురు కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు.

ఫిబ్రవరి 10న ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ శ్మశానవాటిక పార్కింగ్ స్థలంలో గెహ్లాట్ యాదవ్ నిక్కీని హత్య చేసినట్లుపోలీసులు తెలిపారు. ఆ తర్వాత వాయువ్య ఢిల్లీలోని తన గ్రామమైన మిత్రాన్కు 40కిమీ కంటే ఎక్కువ దూరం వెళ్లాడు. మృతదేహాన్ని తన కుటుంబానికి చెందిన ధాబా వద్ద ఉంచి కారును వదిలేశాడు. అతను అదే రోజు సాయంత్రం మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని అతని కుటుంబం సభ్యులు నిర్ణయించారు. పెళ్లి తర్వాత నిక్కీ మృతదేహాన్ని ఫ్రిజ్‌లో ఉంచడానికి ఆ రాత్రి ఆలస్యంగా తన ధాబా కు తిరిగి వచ్చాడు.

తనకు, యాదవ్‌కు వివాహమైందని గెహ్లాట్ కుటుంబానికి తెలుసునని, హత్య కుట్రలో భాగస్వామిగా వారు ఉన్నారని, సాక్ష్యాలను తారుమారు చేయడంలో అతనికి సహకరించారని స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీంద్ర యాదవ్ మీడియా కు తెలిపారు.
గెహ్లాట్ తండ్రి వీరేంద్ర సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారని ప్రత్యేక కమిషనర్ తెలిపారు. అతని ఇద్దరు బంధువులు, ఆశిష్ కుమార్. నవీన్ తో పాటు స్నేహితులు, లోకేష్ సింగ్, అమర్ సింగ్ ను అరెస్ట్ చేశారు.
స్పెషల్ కమీషనర్ ప్రకారం, పోలీసుల విచారణలో నిక్కీ, సాహిల్ గెహ్లాట్ లు అక్టోబర్ 1, 2020న వివాహం చేసుకున్నారని, అయితే ఆమె ఇప్పుడు అధికారికంగా తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని గెహ్లాట్ చెప్పాడు . ఈ విషయాన్ని అతను తన కుటుంబ సభ్యులకు చెప్పగా, ఐదుగురు నిందితులు యాదవ్‌ను అంతమొందించాలని ప్లాన్ చేశారు. మొబైల్ ఫోన్ డేటా కేబుల్‌తో ఆమెను గొంతు నులిమి హత్య చేశారు.