Nirmala Sitharaman : గత ఏడాది మాదిరిగానే ఈ 2023-2024 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేపర్ లెస్ బడ్జెట్ ఫార్మాట్‌ను ఫాలో అవుతున్నారు. ఈ రోజు బడ్జెట్‌ను సమర్పించేందుకు పార్లమెంటుకు వెళుతున్నప్పుడు నిర్మలా సీతారామ్ సంప్రదాయ బహి-ఖాతా స్టైల్ పర్సులో జాతీయ చిహ్నంతో చుట్టబడిన డిజిటల్ టాబ్లెట్‌ను తీసుకువెళ్లారు. ఆమె తన అధికారుల బృందంతో కలిసి తన కార్యాలయం వెలుపల ఒక ఫోటోకు కూడా పోజులిచ్చారు. 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రీమతి సీతారామన్‌కి ఇది ఐదవ బడ్జెట్.
శ్రీమతి సీతారామన్ జూలై 2019లో యూనియన్ బడ్జెట్ పత్రాలను తీసుకువెళ్లడానికి సాంప్రదాయ బహి-ఖాతా కోసం బడ్జెట్ బ్రీఫ్‌కేస్ విధానాన్నే అనుసరించారు. 2020లో నూ అదే పద్ధతిని ఫాలో అయ్యారు. కరోనా పాండమిక్ హిట్ తరువాత 2021లో, ఆమె తన ప్రసంగంతో పాటు ఇతర బడ్జెట్ పత్రాలను తీసుకువెళ్లడానికి డిజిటల్ టాబ్లెట్ సాంప్రదాయాన్ని అమలుకు తీసుకువచ్చారు. ఈ పేపర్ లెస్ పద్ధతి అందరిని అమితంగా ఆకట్టుకుంది. అదే సంవత్సరం, పార్లమెంటు సభ్యులు , ప్రజలకు బడ్జెట్ పత్రాలను అవాంతరాలు లేకుండా యాక్సెస్ చేయడానికి ఆర్థిక మంత్రి యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ ని కూడా ప్రారంభించారు.
వరుసగా 5 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆరో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ , పి చిదంబరం వంటి లెజెండ్‌ల లిస్ట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చేరిపోయారు. స్వతంత్ర భారతదేశంలో ఐదు వరుస బడ్జెట్‌లను సమర్పించిన ఆరవ మంత్రిగా పేరు సంపాదించుకున్నారు నిర్మలా సీతారామన్. ఏప్రిల్ 2023 నుండి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి శ్రీమతి సీతారామన్ బడ్జెట్ ను ఈ రోజు కేటాయించనున్నారు. 2019 నుంచి ఐదు వరుస వార్షిక ఆర్థిక నివేదికలను సమర్పించిన ఇతర మంత్రులలో అరుణ్ జైట్లీ, పి చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్ మరియు మొరార్జీ దేశాయ్ ఉన్నారు.