Nitya Menon : నిత్యామేనన్ టాలీవుడ్‌లో సినిమాలకు కొదువ లేకపోయినప్పటికీ స్టార్ స్టేటస్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. అయితే అమ్మడికి యూత్‌లో క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. టాలీవుడ్‌లో సినిమాలు తగ్గినప్పటికీ ఈ బొద్దుగుమ్మకి యూత్ మనసులో స్థానం తగ్గలేదు. దక్షిణాదిలో వరుస సినిమాలు చేసి ప్రేక్షకుల్ని అలరించిన ఈ క్యూటీ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. సినీ పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరోతో ఆమె ఏడడుగులు వేయనుందని గుసగుసలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.
Nitya Menon : అవకాశాల కోసం వెనుదిరిగి చూడలేదు..
‘అలా.. మొదలైంది’తో తెలుగు తెరకు పరిచయమైన నిత్యామేనన్ ఆ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో అవకాశాల కోసం తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కథానాయికగానే కాకుండా సెకండ్ హీరోయిన్‌గానూ నటించి దక్షిణాది ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇటీవల ‘భీమ్లానాయక్’ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించి అలరించింది. తాజాగా అమ్మడు తన పెళ్లి వార్తతో వార్తల్లో నిలిచింది. ఈ ముద్దుగుమ్మను పెళ్లాడబోయే వరుడు మలయాళీ పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరో అని తెలుస్తోంది.
మలయాళీ స్టార్ హీరోతో నిత్యామేననకు మ్యూచువల్ ఫ్రెండ్స్ పరిచయం ఏర్పడిందట. ఈ పరిచయం కాస్తా కొద్దిరోజులకే ప్రేమగా మారిందని సమాచారం. అయితే వీళ్లిద్దరి ప్రేమ ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు.. ఎన్నో ఏళ్ల నుంచి ప్రేమలో మునిగి తేలుతున్నారని సమాచారం. ఈ క్రమంలోనే తమ ప్రేమ విషయాన్ని ఇటీవల ఇరు కుటుంబసభ్యులకు తెలిపారని టాక్. పెద్దలు కూడా అభ్యంతరం తెలపక పోవడంతో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ప్రచారం జోరుగానే సాగుతోంది. దీనికి సంబంధించిన వార్తలు సైతం పలు వెబ్‌సైట్లలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిత్య పెళ్లి వార్తలు విని ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ స్టార్ హీరో, నిత్యామేనన్ పెళ్లాడబోయే ఆ అదృష్టవంతుడు ఎవరంటారా? ఆ సమాచారం మాత్రం ఇప్పటికీ గుట్టుగానే ఉంది.