Nora-Fatehi : ఫ్యాషన్‌తో ప్రయోగాలు చేయాలంటే బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ తరువాతే ఎవరైనా. ఈ బ్యూటీ ఫాలో అయ్యే ఫ్యాషన్ స్టైల్స్ అందరిని అమితంగా ఆకట్టుకుంటాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. సమయం వచ్చినప్పుడల్లా తనదైన ట్రెండ్ లుక్స్‌తో తన ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేస్తుంటుంది ఈ బ్యూటీ. తాజాగా నోరా ఫతేహి అదిరిపోయే ఎరుపు రంగు డిజైన్ అవుట్‌ఫిట్‌ను ధరించి హాట్ ఫోటో షూట్‌లతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఈ పిక్స్‌ను పోస్ట్ చేసి నెట్టింట్లో మంటలు రేపుతోంది ఈ బోల్డ్ బ్యూటీ.

నోరా ఫతేహి డిజైనర్ రెడ్ డ్రెస్‌ను ధరించి గంభీరమైన డ్రమాటిక్ లుక్‌తో అందరినీ ఆకర్షిస్తోంది. తన ఫ్యాషన్ లుక్స్‌తో ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకుంది కాబోలూ హాలీవుడ్ తారలు సైతం నివ్వెరపోయేలా ఫ్యాషన్ ట్రెండ్స్ ను ఫాలో అవుతోంది ఈ చిన్నది తాజాగా నోరా ఫోటో షూట్ కోసం, ఎరుపు రంగు పొట్టి గౌవును వేసుకుని తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది. అవుట్‌ఫిట్‌కు వచ్చిన డ్రామాటిక్ రఫుల్ డిటైల్స్, ఆమె పొడవాటి జడ తన లుక్‌లో హైలైట్ గా నిలిచాయి.

నోరా ఫతేహి అంతర్జాతీయ లేబుల్ ఆర్టినే షెల్ఫ్‌ల నుండి ఈ డిజైనర్ డ్రెస్ ను ఎన్నుకుంది. ఈ అవుట్‌ఫిట్ నోరా ఫిగర్‌కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ప్రముఖ స్టైలిస్ట్ మేనకా హరిసింఘాని నోరా ఫతేహికి అద్భుతమైన స్టైలిష్ లుక్స్‌ను అందించింది. మేకప్ ఆర్టిస్ట్ , హెయిర్ స్టైలిస్ట్ మరియానా ,ముకుచ్యన్ నోరా అందాలకు మరిన్ని మెరుగులు దిద్దారు. నోరా అద్భుతమైన లుక్స్‌ను ఫోటోగ్రాఫర్ తేజస్ నెరుర్కర్ కెమెరాలో అందంగా బంధించాడు. నోరా ఈ పిక్స్‌తో పాటు హార్ట్ ఏమోజీని పోస్ట్ చేసి ఫాలోవర్స్‌ను ఇంప్రెస్ చేసింది.

రీసెంట్ గా చేసిన ఫోటో షూట్ కోసం బరావియా ఫ్యాషన్ లేబుల్ నుండి నలుపు , బంగారు వర్ణంలో అత్యద్భుతంగా డిజైన్ చేసిన దుస్తులను ధరించి రాణిలా కనిపించి తన ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. స్ట్రాప్‌లెస్ బ్లాక్ డ్రెస్ పైన వచ్చిన హెవీ గోల్డెన్ వర్క్ నోరా అందాన్ని మరింత పెంచేశాయి. ఈ లుక్ లో అద్భఉతంగా కనిపించి ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేసింది ఈ చిన్నది.

ఈ అవుట్ ఫిట్‌కు సెట్ అయ్యే విధంగా నోరా తొడ ఎత్తైన బంగారు బూట్లను ధరించి మెస్మరైజ్ చేసింది. చేతికి స్టేట్‌మెంట్ బ్యాంగిల్స్ , ఆకర్షణీయమైన తలపాగా ధరించి తన వైవిధ్యమైన లుక్‌తో అందరిని ఫిదా చేసింది. ఆమె కనులకు వింగ్డ్ ఐలైనర్, మెరిసేటి ఐషాడో ,పెదవులపై న్యూడ్ లిప్ షేడ్ దిద్దుకుని తన లుక్ ను పూర్తి చేసింది. అందరిని మంత్రముగ్ధులను చేసింది.