మరో భారీ యాక్షన్ సీక్వెన్స్ లో “ఎన్టీఆర్ 30”.!
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కోసం అందరికీ తెలిసిందే. మరి హాలీవుడ్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ లతో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రాన్ని శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా ఈ సినిమాపై మరో అప్డేట్ తెలుస్తుంది. మేకర్స్ ఇప్పుడు ఎన్టీఆర్ సహా ఇతర ముఖ్య పాత్రలతో అయితే ఇంకో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
దాదాపు రెండు వారాల అయితే ఈ షూటింగ్ జరగనున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఓ మాసివ్ సీక్వెన్స్ ని తెరకెక్కించగా ఇప్పుడు ఇంకో సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారట. ఇప్పటికీ ఈ సిన్మాలు యాక్షన్ సీక్వెన్స్ ల కోసం హాలీవుడ్ ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ బెన్నీ కేట్స్ ని స్పెషల్ గా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.