Star Heros Remuneration : కరోనా మహమ్మారి కారణంగా ఎక్కువగా బాగా చితికిపోయిన పరిశ్రమల్లో ఒకటి చిత్ర పరిశ్రమ. కరోనా కారణంగా అప్పటికే సెట్స్ పైన ఉన్న బడా సినిమాలతో పాటు చిన్నా చితక సహా ఎన్నో సినిమాలు సెట్స్ పైనే ఆగిపోయాయి. కొన్ని సినిమాల రిలీజ్ బాగా ఆలస్యమైంది. ఆ ఎఫెక్ట్ సినిమా బడ్జెట్‌పై పడింది. ఇప్పటికీ సరిగా ఆ పరిశ్రమ కోలుకోలేదనే చెప్పాలి. కొవిడ్ టైంలో ఓటీటీకి బాగా అలవాటు పడిపోయిన ప్రేక్షకులు పెద్దగా థియేటర్ల మొహం చూడటం లేదు. పోనీ వస్తున్న ప్రేక్షకులకు కూడా సినిమా టికెట్ ధరలు ఇబ్బందికరంగా మారడంతో వారు కూడా వెనక్కి తగ్గుతున్నారు. మొత్తానికి ఒకవైపు ఓటీటీ, టికెట్ ధరలు ఇపుడు నిర్మాతల పాలిట గుదిబండగా మారాయి.
Star Heros Remuneration : థియేటర్స్ వైపు చూడని ప్రేక్షకులు
ఇన్ని ఇబ్బందుల నడుమ ఓ సినిమా తీయాలంటే నిర్మాతలు ఆలోచించాల్సి వస్తోంది. దీంతో ఖర్చు ఎలాగైనా తగ్గించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇతర ఏ ఖర్చులు తగ్గించుకున్నా పెద్దగా టోటల్ నిర్మాణ వ్యయంపై ఫరక్ పడదు. దీంతో ఆకాశమే హద్దుగా సాగుతున్న హీరోల రెమ్యూనరేషన్‌కు బ్రేకులు వేయాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం పెరిగిన టికెట్ రేట్స్ కారణంగా ఎక్కువ శాతం ప్రేక్షకులు థియేటర్స్ వైపు చూడటం లేదు. రేపో మాపో ఓటీటీలో వస్తుందిలే అన్న ధీమాతో ఉన్నారు. దీంతో నిర్మాతలు ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలోనే హీరోల పారితోషకాల విషయమై నిర్మాత దిల్ రాజు టాలీవుడ్‌లో ఉన్న అగ్రహీరోలతో సమావేశమైనట్టు సమాచారం.
ఇక పెరిగిపోతున్న నిర్మాణ వ్యయం.. తదితర విషయాలను పరిగణలోకి తీసుకొని తమ పారితోషకం తగ్గించుకునేందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు ముందుకు వచ్చినట్టు సమాచారం. త్వరలోనే మిగతా బడా హీరోలతో సమావేశమై రెమ్యునరేషన్ విషయమై దిల్ రాజు మాట్లాడనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే షూటింగుల బంద్ విషయమై నిర్మాతల మండలి చిరంజీవికి ఓ లేఖ కూడా రాశారు. కాస్ట్ కటింగ్, రెమ్యునరేషన్ విషయమై ఒక నిర్ణయం తీసుకునేలా ఆ లెటర్‌లో అన్ని విషయాలనూ ప్రస్తావించారు. దీనిపై మరింత సమాచారం ఈ రోజు సమావేశం తర్వాత వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఇక ఓటీటీకి సినిమాల విడుదల విషయంలో కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.