గెస్ట్ హౌస్ కి వస్తే ఆఫర్స్ .. బేబీ మూవీ యాక్టర్ హాట్ కామెంట్స్ పరిశ్రమలో ఒక వెలుగు వెలగాలని అనేక మంది నటీమణులు ఈ రంగంలోకి వస్తారు. కానీ అందులో కొందరు మాత్రమే తాము అనుకున్న స్థాయికి చేరుకుంటారు. పైకి కనిపించే విధంగా లోపల ఉండదు ఈ రంగుల ప్రపంచం. ముఖ్యంగా ఆడవాళ్లు ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
వాటిలో ముఖ్యమైంది కాస్టింగ్ కౌచ్. ఎవరు అవునన్నా, కాదన్నా సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉంది అనేది వాస్తవం.అప్పుడప్పుడు దీని గురించి కొందరు మాట్లాడిన కానీ, కేవలం అవి మాటలు గానే మిగిలిపోతున్నాయి కానీ, ఎలాంటి మార్పు అనేది లేదు. తాజాగా ఈ కాస్టింగ్ కౌచ్ గురించి కిర్రాక్ సీత హాట్ కామెంట్స్ చేసింది.
చిన్న సినిమాగా విడుదలై ఘన విజయాన్ని అందుకున్న బేబీ సినిమాలో కీలక పాత్ర పోషించి, మంచి మార్కులు సొంతం చేసుకున్న కిర్రాక్ సీత తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బేబీ సినిమాలో నేను పోషించిన పాత్ర నెగిటివ్ షెడ్ లో ఉన్న కానీ, నటన పరంగా నాకు మంచి పేరు తీసుకుని వచ్చింది.
ఈ సినిమా తర్వాత నాకు మంచి అవకాశాలు వస్తాయని అనుకుంటున్నా అంటూ చెప్పింది. నన్ను నేను నిరూపించుకునే అవకాశం కోసం తిరిగే క్రమంలో నిర్మాతల నుంచి డైరెక్టర్స్ నుండి కొన్ని వల్గర్ మాటలు వచ్చాయి. నన్ను గెస్ట్ హౌస్ కి రమ్మని కూడా పిలిచారు. కమిట్మెంట్స్ ఇస్తే అవకాశాలు ఇస్తామని కూడా చెప్పారు.
అలాంటి వాటికి నేను ఒప్పుకోలేదు. నా టాలెంట్ తోనే అవకాశాలు వస్తాయని ఎదురుచూశాను. ఇప్పటికి కూడా అదే నమ్మకంతో ఉన్నాను. అందుకే కాస్టింగ్ కౌచ్ లాంటి వాటిని నేను పెద్దగా పట్టించుకోనంటూ చెప్పుకొచ్చింది కిర్రాక్ సీత