AP Politics: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ గత ఎన్నికలలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా 154 స్థానాలలో వైసీపీ గెలిచింది. ఇదంతా వైఎస్ జగన్ అనే బ్రాండ్ తోనే సాధ్యం అయ్యిందనేది అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికే వైసీపీలో అదే బ్రాండ్ ఉంది. రాజధానుల విషయంలో ఎవరికి ఎన్ని అభిప్రాయాలు ఉన్నా కూడా వైఎస్ జగన్ నిర్ణయమే ఫైనల్ అలాగే విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఎస్టాబ్లిష్ చేయడంలో కూడా వైఎస్ జగన్ నిర్ణయమే కీలక అనేది అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే వైఎస్ జగన్ బ్రాండ్ ని ఆ పార్టీ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు. రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేలు సొంతబలంతో కంటే కేవలం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలే తమని గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు.
అలాగే ఈ సారి ఏకంగా టార్గెట్ 175 పెట్టారు. ఇది సాధ్యమే అని జగన్ నాయకులు అందరికి చెబుతున్నారు. దానిని ఎందుకు సాధించాలి అనేది కూడా చెబుతున్నారు. మొత్తం అన్ని సీట్లు మనమే గెలిస్తే ఎలాంటి నిర్ణయాలు అయిన స్వేచ్చగా తీసుకోవచ్చు అనేది ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశ్యం. ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు జగన్ ని ఓడించడానికి పొత్తులతో బరిలోకి దిగాలని భావిస్తున్నాయి. ఒంటరిగా పోటీ చేసి జగన్ ని ఓడించే దమ్ము ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేనకి లేదని దీంతో అర్ధమైపోతుంది.
సుదీర్ఘ చరిత్ర ఉందని చెప్పుకునే చంద్రబాబు జగన్ వ్యూహాలకి తల పట్టుకున్తున్నాడు. అలాగే దశాబ్దం చరిత్ర ఉన్న పవన్ కళ్యాణ్ అయితే కనీసం ప్రజలలోకి కూడా బలంగా వెళ్ళలేకపోతున్నాడు. అలాగే సంస్థాగతంగా పార్టీని బలంగా తయారు చేసుకోలేకపోయారు. సినిమా స్టార్ అనే ఫేమ్ ఉన్నా కూడా జగన్ ని ఎదుర్కోవడం లో పవన్ కళ్యాణ్ వెనకబడిపోయారని చెప్పాలి. ఈ నేపధ్యంలోనే వైసీపీ నాయకులు వారికి చాలెంజ్ లు చేస్తూ వారికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.