ఈ మధ్యకాలంలో తెలుగులో చిన్న చిత్రాలు పెద్ద హిట్స్ గా నిలుస్తున్నాయి. కొత్తదనం ఉన్న కథలతో దర్శకులు, హీరోలు ప్రేక్షకుల ముందుకి వచ్చి తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. రొటీన్ కి భిన్నమైన కథలతో ప్రేక్షకులని ఎంటెర్టైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కొత్తదనం ఉన్న కథలతో ప్రయాణం చేసే హీరోల జాబితాలో విశ్వక్సేన్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయినా విశ్వక్సేన్ తరువాత ఫలక్ నుమా దాస్ సినిమాతో హిట్ కొట్టాడు. ఇక ఆ సినిమా తర్వాత కూడా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ ముందుకి వెళ్తున్నారు.
చివరిగా అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అందుకుంది. డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఓటీటీలో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా అలరించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఓరిదేవుడా అనే సినిమాతో దీపావళికి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. తమిళ్ హిట్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లోనే వచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ఆకట్టుకున్నాయి.
విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో మోడ్రన్ యముడుగా, రాహుల్ రామకృష్ణ చిత్రగుప్తుడుగా స్పెషల్ అపీరియన్స్ ఇచ్చారు. బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న అమ్మాయిని తప్పనిసరి పరిస్థితిలో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన హీరో జీవితంలోకి తన చిన్ననాటి లవర్ ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి వారి ముగ్గురు మధ్య జరిగే కన్ఫ్యూజన్ లవ్ డ్రామాతో ఈ సినిమా ఉండబోతుంది అని ట్రైలర్ బట్టి అర్ధమవుతుంది. ట్రైలర్ ని కామెడీ, లవ్, ఎమోషనల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఫన్ జోనర్ లో ఎలివేట్ చేశారు. ఇక చనిపోయిన హీరోకి మళ్ళీ తన ప్రేమని గెలిపించుకోవడానికి దేవుడుగా ఉన్న వెంకటేష్ సెకండ్ టికెట్ ఇస్తాడు. అలా భూమిపైకి వెళ్లిన హీరో ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనే అంశంతో ట్రైలర్ ఉంది. ట్రైలర్ చూస్తూ ఉంటే దీపావళికి ఫ్యామిలీ మొత్తం కలిసి ఆశ్వాదించే చిత్రంగానే కనిపిస్తుంది. మరి విశ్వక్ సేన్ ఈ మూవీతో సాలిడ్ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.