ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చిత్రకారులు తమ అద్భుతమైన కళా నైపుణ్యంతో పెయింటింగ్స్ వేస్తూ ఆకట్టుకుంటుంటారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మోనాలిసా చిత్రం అద్భుతమైన కళాకాండంగా అందరూ చెబుతూ ఉంటారు. అలాగే గొప్ప చిత్రకారుడుగా లియోనార్డో డావిన్సీ గురించి చరిత్ర చెబుతుంది. ఇండియాకు వచ్చేసరికి ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని చిత్రాలు లక్షల రూపాయలకు అమ్ముడుపోతూ ఉంటాయి. పెయింటింగ్స్ మీద కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కునేవారు కూడా ఉంటారు. ప్రకృతిలోని అందాలను, మనసులోని అంతర్లీన భావాలను పెయింటింగ్స్ ద్వారా చిత్రకారుడు చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ కారణంగానే పెయింటింగ్స్ కు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ ఉంది.
“The days are long, but the years are short.”
This brilliant painting shows human aging pic.twitter.com/Qw6T4WBHPN
— Vala Afshar (@ValaAfshar) August 13, 2022
తాజాగా అలాంటి ఓ పెయింటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసి నెట్టిజనులు కూడా ఆశ్చర్యపోతున్నారంటే ఎంతగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీడియోలో ఉన్న పెయింటింగ్ ని ఒక వైపు నుంచి చూస్తే ఓ చిన్నారి ముఖం కనిపిస్తుంది. అక్కడ నుంచి మరోవైపు వెళ్లే కొద్దీ ఆ పెయింటింగ్ ముఖంలో వయసు మారుతూ ఉంటుంది. అలా వయసు క్రమంలో చిన్నారి నుంచి వృద్ధురాలి వరకు కనిపించే విధంగా చిత్రకారుడు పెయింటింగ్ అద్భుతంగా చిత్రీకరించాడు. దీనిని క్యాజువల్ గా చూస్తే పెయింటింగ్‌లో ఎవరో అమ్మాయి ఫేస్ ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ కుడివైపు నుంచి మెల్లగా ఒక్క అడుగు వేసుకుంటూ ఎడమవైపుకు వస్తూ ఉంటే ఆ అమ్మాయి వయసులో వ్యత్యాసాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పెయింటింగ్ చూసిన ప్రతి ఒక్కరు అద్భుతంగా ఉంది అంటూ ఆశ్చర్య పోవడం విశేషం. చిత్రకారుడు ప్రతిభకు అద్దం పట్టే పెయింటింగ్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ అయింది. ఏకంగా 36 లక్షల మంది ఈ వీడియోని చూడడం విశేషం.