Tollywood: బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా మార్కెట్ పరిధి అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్ ని సైతం బీట్ చేస్తూ భారీ బడ్జెట్ తో సినిమాలు చేసే స్థాయికి వెళ్ళిపోయింది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఫస్ట్ టైం అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలు తెలుగులో తెరకెక్కుతున్నాయి. అది కూడా డార్లింగ్ ప్రభాస్ గా తెరకెక్కుతూ ఉండటం విశేషం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అలాగే ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రానటువంటి కథతో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాని ఫ్రాంచైజ్ గా తీసుకురావాలనే ఆలోచనలో నాగ్ అశ్విన్ ఉన్నాడని తెలుస్తుంది.
అందులో భాగంగా మొదటి పార్ట్ ని వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆ సినిమా సక్సెస్ రేంజ్ బట్టి తరువాత వచ్చే సిరీస్ ల బడ్జెట్ ఉండబోతుంది. ఇక పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుటున్న సలార్ మూవీ కూడా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది. ఇక అ రెండు హిట్ అయితే ప్రశాంత్ నీల్ యూనివర్స్ లో భాగంగా ఈ సిరీస్ ని కొనసాగించే ఉద్దేశ్యంలో నిర్మాతలు ఉన్నారు.

సలార్ పార్ట్ వన్ ఈ ఏడాదిలోనే రిలీజ్ కాబోతుంది. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఇంకా షూటింగ్ ప్రారంభం కాకముందే రెండు భాగాలుగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించడానికి సుజిత్ ప్లాన్ చేసుకున్నట్లు టాక్. ఇక మహేష్ బాబు రాజమౌళి కాంబోలో రాబోయే అడ్వంచర్ మూవీ కూడా ఫ్రాంచైజ్ తరహాలో సిరీస్ లుగా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు రచయిత విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అదే జరిగితే మన టాలీవుడ్ స్టార్ హీరోలైన ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల ఇమేజ్ పాన్ వరల్డ్ రేంజ్ లో ఎస్టాబ్లిష్ కావడం పక్కా అనే మాట వినిపిస్తుంది.