Pathan Movie: బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ రికార్డులు బ్రేక్ చేస్తూ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఏ మాత్రం తగ్గకుండా వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ గ్రాస్ ని ఈ మూవీ కలెక్ట్ చేసింది. షారుఖ్ ఖాన్ పని అయిపొయింది అని మాట్లాడినవారందరికీ ఈ సినిమా కలెక్షన్స్ సమాధానం అయ్యింది. అలాగే షారుఖ్ ఖాన్ ని ద్వేషించే వారికి కూడా పఠాన్ సినిమా ద్వారానే సమాధానం చెప్పాడు. తాను భారతీయుడుగా చెప్పుకోవడానికి ఎంత గర్వపడతాను అనేది పఠాన్ సినిమా ద్వారా షారుఖ్ ఖాన్ చేసి చూపించాడు. దీంతో సామాన్య ప్రేక్షకులు అందరూ కూడా సినిమాకి భారీ కలెక్షన్స్ అందిస్తూ బ్రహ్మరథం పడుతున్నారు.
ఇదిలా ఉంటే గత రెండేళ్ళ నుంచి సక్సెస్ లేక సతమతం అవుతున్న బాలీవుడ్ చిత్రపరిశ్రమకి పఠాన్ మూవీ ఊపిరి పోసింది అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ పఠాన్ మూవీ గ్రాస్ పరంగా ఇప్పటి వరకు 700 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఇక సౌత్ లో కూడా సత్తా చాటుతూ మొదటిసారిగా ఒక హిందీ సినిమా వంద కోట్ల కలెక్షన్స్ కి సమీపిస్తుంది. ఇదిలా ఉంటే హిందీలో మొదటి వారంలో హైయెస్ట్ కలెక్షన్స్ షేర్ ని రాబట్టిన చిత్రాల జాబితాలో ఇప్పుడు పఠాన్ టాప్ లోకి వచ్చి చేరింది. ఇప్పటి వరకు బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ షేర్ రాబట్టిన చిత్రంగా కేజీఎఫ్ చాప్టర్ 1 ఇప్పటి వరకు ఉండేది.
ఈ మూవీ కలెక్షన్స్ 268.63 కోట్లుగా ఉంది. ఇక రెండో స్థానంలో బాహుబలి 2 మూవీ 247 కోట్ల షేర్ తో ఉంది. మూడో స్థానంలో సల్మాన్ ఖాన్ సుల్తాన్ సినిమా 229.16 కోట్ల షేర్ తో ఉంది. కేజీఎఫ్ చాప్టర్ 2 మీద ఉన్న రికార్డ్ ని ఇప్పుడు పఠాన్ బ్రేక్ చేసింది. మొదటి వారంలో ఈ సినిమా ఏకంగా 351 షేర్ రాబట్టడం విశేషం. మొత్తానికి ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఎవెన్ కలెక్షన్స్ ని అందుకోవడంతో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. వెయ్యి కోట్లని పఠాన్ దాటితే బాలీవుడ్ నుంచి అ ఫీట్ అందుకున్న రెండో సినిమాగా ఈ మూవీ నిలుస్తుంది.