Pathan Movie: షారుక్ ఖాన్ హీరోగా సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో హిందీలో తెరకెక్కిన మూవీ పఠాన్. ఈ సినిమా జనవరి 25న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్టుని సొంతం చేసుకుని రికార్డ్ స్థాయి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. బాలీవుడ్ లో ఇప్పటివరకు హిందీలో హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డును పఠాన్ ఇప్పటికే బ్రేక్ చేసింది. ఇక నాలుగేళ్ల తర్వాత షారుక్ ఖాన్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లి చూశారు. బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫార్ములా అయినా స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కడంతో అంచనాలు మించి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల కలెక్షన్ గ్రాస్ ని అధికమించింది. ఇక హిందీలో ఈ మూవీ 500 కోట్ల నెట్ ప్రాఫిట్ ని సాధించిన సినిమాగా నిలిచింది. కేజీఎఫ్ చాప్టర్స్ 2 రికార్డును ఇప్పటికే బ్రేక్ చేసిన పఠాన్ ఇప్పుడు బాహుబలి 2 రికార్ట్లపై కన్నేసింది. హిందీలో బాహుబలి 2 ఏకంగా 518 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటికే పటాన్ మూవీ హిందీలో 510 కోట్ల నెట్ ప్రాఫిట్ కి రీచ్ అయింది.
మరో 9 కోట్లు కలెక్ట్ చేస్తే బాహుబలి 2 రికార్డులను షారుక్ ఖాన్ పఠాన్ మూవీ బ్రేక్ చేస్తుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. మరోవైపు కార్తీక్ ఆర్యన్ సెహజాదా మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మీద ఇప్పటికే పాజిటివ్ బజ్ ఉంది. అయితే పఠాన్ బుకింగ్స్ సెహజాదా కంటే ఎక్కువ ఉండటం చూస్తుంటే కచ్చితంగా బాహుబలి 2 రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసే అవకాశం ఉందని బి టౌన్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.