పవన్ కల్యాణ్ మూవీ రిలీజ్ అంటే అభిమానులకు పండగే. అలాంటి పవర్ స్టార్ పవర్‌పుల్ భీమ్లా నాయక్‌గా వస్తున్నాడంటే.. ప్రేక్షకుల్లో చెప్పలేనంత అనుభూతి పెరిగిపోయింది. అయితే కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే కాకుండా రానా దగ్గుబాటి కూడా కలిసి రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఫిబ్రవరి 25 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన భీమ్లా నాయక్ ఎలాంటి రెస్పాన్స్ కూడగట్టుకొన్నదంటే..
అసలు భీమ్లా నాయక్ కథేమిటంటే.. కర్నూలు జిల్లాలో భీమ్లా నాయక్ (పవన్ కల్యాణ్) నిజాయితీపరుడుగా ఉండే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. వరంగల్ మాజీ ఎంపీ (సముద్ర ఖని) కుమారుడైన డేనియల్ శేఖర్ (రానా దగ్గుబాటి) రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఏపీ సరిహద్దులో మద్యపానంపై ఆంక్షలు ఉన్న ప్రదేశంలో పీకల దాకా తాగి భీమ్లా నాయక్‌కు పట్టుబడడం తో అరెస్ట్ అవుతాడు. అయితే రాజకీయంగా పలుకుబడి ఉండటంతో సీఐ సూచన మేరకు డేనియల్ శేఖర్‌కు పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు చేయడమే కాకుండా మద్యం కూడా సరఫరా చేస్తారు. దింతో భీమ్లా నాయక్, మరో లేడి కానిస్టేబుల్ సస్పెండ్‌కు గురవుతారు.
భీమ్లా నాయక్ మూవీలో చల ట్విస్టులు ఉన్నాయి.. భీమ్లా నాయక్ ఏ పరిస్థితుల్లో సస్పెండ్‌కు గురవుతారు? సస్పెండ్ గురైన భీమ్లా నాయక్ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? భీమ్లా నాయక్‌ను డేనియల్ శేఖర్ ఎలాంటి కేసులో ఇరికించాడు? తనను అరెస్ట్ చేసిన భీమ్లా నాయక్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటాడు? భీమ్లా నాయక్ భార్య సుగుణ (నిత్య మీనన్) కూడా డేనియల్ శేఖర్ ఫ్యామిలీ ఎలాంటి కేసులో ఇరికిస్తారు. తన భార్యను అరెస్ట్ చేసిన తర్వాత భీమ్లా నాయక్ రియాక్షన్ ఏమిటి? భీమ్లా నాయక్ నుంచి డేనియల్ శేఖర్‌ను ఆయన భార్య (సంయుక్త మీనన్) ఎలా దక్కించుకొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే భీమ్లా నాయక్ సినిమా కథ.
పవన్ కల్యాణ్ ఫెర్ఫార్మెన్స్: భీమ్లా నాయక్‌గా పవన్ కల్యాణ్ పాత్ర రకరకాల కోణాలు ఉన్న పాత్ర. నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్‌గా, అలాగే తండాలో గిరిజన ప్రజల కోసం ప్రాణాలకు తెగించే యువకుడిగా. మహిళలకు ఇంపోర్టన్స్ ఇచ్చే సంస్కారవంతుడిగా, పేదల కష్టం వస్తే తోడుంటే మనిషి గా ఇలా చాలా వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు పవన్ కళ్యాణ్. యాక్షన్ సీన్లలో, సెంటిమెంట్ సన్నివేశాల్లో తన మార్కు స్టయిల్‌ను చూపించాడు. లుంగీ కట్టిన భీమ్లా నాయక్‌లోని ఆవేశం తెర మీద ఫైర్ లా కనిపిస్తుంది.
రానా యాటిట్యూడ్: బాడీ లాంగ్వేజ్ రానా విషయానికి వస్తే.. అరికాలి నుంచి తల వరకు ఫుల్లుగా పొగరు ఉన్న రాజకీయ నేతగా డేనియల్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేసాడు. యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్‌తో పవన్ కల్యాణ్‌తో నువ్వా? నేనా అనే విధంగా పోటీపడ్డారు. డేనియల్ పాత్రలో పవర్ఫుల్ గా కనపడటంతో చుట్టు ఉన్న పాత్రలనీ యాక్టివ్‌గా కనిపించాయి. ఒక మల్టీస్టారర్ సినిమాకు కావాల్సిన మసాలాను తన పాత్ర ద్వారా రానా చూపించాడు. కొన్నిసార్లు పవన్‌పై పైచేయి సాధించాడనినే చెప్పాలి.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. భీమ్లా నాయక్‌కు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చల స్పెషల్ ఎట్రాక్షన్. అఖండ రేంజ్‌కు ఏమాత్రం తగ్గకుండా రీరికార్డింగ్‌తో అదరగొట్టేసారు. తెర మీద పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మరోసారి తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడని చెప్పవచ్చు తమన్. కెమెరామెన్ రవి కే చంద్రన్ సినిమా మరో ఆకర్షణ. యాక్షన్ సీన్లను సరికొత్తగా కెమెరాలో బంధించాడనే చెప్పాలి. ఇక్కడ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ పనితీరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తండా సెట్, పోలీస్ స్టేషన్ సెట్స్ కథకు ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌గా మారిపోయాయి. నవీన్ నూలి ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. సితారా ఎంటర్టైన్మెంట్ ప్రమాణాలకు తగినట్టుగా నాగవంశీ చేపట్టిన నిర్మాణ విలువలు భేష్ అనే స్థాయిలో ఉన్నాయి.
ఎమోషనల్, యాక్షన్ కంటెంట్‌తో భీమ్లా నాయక్‌ను పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌లా తివిక్రమ్ శ్రీనివాస్, సాగర్ అందించారు. నిజమైన మల్టీస్టారర్ అనిపించేలా పవన్ కల్యాణ్, రానా పాత్రలను బ్యాలన్ చేయడం ఈ సినిమాకు ప్లస్. నిత్యమీనన్, సంయుక్త మీనన్‌కు నటన ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. కేవలం పవన్ ఫ్యాన్స్‌కే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు భీమ్లా నాయక్ పక్కాగా నచ్చే విధంగా అన్ని అంశాలు ఉన్నాయి. భారీ అంచనాలను ఏ మాత్రం తగ్గించకుంఇడా ఈ సినిమా మంచి అనుభూతిని పంచుతుంది.
భీమ్లా నాయక్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు నటీనటులు: పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి, నిత్య మీనన్, సంయుక్త మీనన్, సముద్ర ఖని, బ్రహ్మనందం, మురళీ శర్మ, రఘుబాబు, నర్రా శ్రీను, కాదంబరి కిరణ్, పమ్మి సాయి తదితరులు
దర్శకత్వం: సాగర్ కే చంద్ర
స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, ఎస్ రాధాకృష్ణ
సినిమాటోగ్రఫి: రవి కే చంద్రన్
ఎడిటింగ్: నవీన్ నూలీ
మ్యూజిక్: తమన్ ఎస్
బ్యానర్: సితారా ఎంటర్టైన్మెంట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్