Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో తనదైన వ్యూహాలతో ముందుకి వెళ్తున్నారు. వైసీపీ, టీడీపీ పార్టీలని బలంగా ఎదుర్కొంటూ రాజకీయాలు చేయాల్సిన అవసరం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముందు ఉంది. అయితే ఎందుకనో వ్యూహాత్మక మౌనంలో జనసేనాని ఉన్నారు. అయితే ఏపీలో ప్రస్తుతం వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ వైరం జోరుగా సాగుతుంది. విమర్శల నుంచి ప్రత్యక్ష దాడుల వరకు రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు వెళ్ళిపోతున్నారు. వీటిని ప్రజలు కూడా చూస్తున్నారు. అయితే ఈ రెండు పార్టీలు ఇలా విద్వాంస రాజకీయాలు చేయడం, విద్వేష రాజకీయాలు చేయడంపై ప్రజలలో కూడా ఒక అభద్రతా భావం పెరుగుతుంది.

మరల వైసీపీ అధికారంలోకి వస్తే పరిస్థితులు ఇంకా దిగజారిపోతాయని భావిస్తున్నారు. అలాగే టీడీపీ అధికారంలోకి వచ్చిన కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలని వేటాడటం మొదలు పెడుతుంది అని భావిస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీలకి ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన వైపు ప్రజలు చూసే అవకాశం ప్రస్తుతం పుష్కలంగా ఉంది. ప్రజలకి కరెక్ట్ గా పవన్ కళ్యాణ్ భరోసా ఇవ్వగలిగితే ఇక బలంగా జనంలోకి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే తాజాగా ఏపీలో ఒక సర్వే వచ్చింది.
జనసేనాని పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నా చేగొండి హరిరామ జోగయ్య ఈ సర్వే చేయించారు. తాజాగా దానిని ఆయన విడుదల చేశారు. ఏపీలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే 58 శాతం ఓటింగ్ తో భారీగా సీట్లు సొంతం చేసుకుంటుంది అని భావిస్తున్నారు. అలాగే విడివిడిగా పోటీ చేసిన టీడీపీకి 70 స్థానాలు, వైసీపీకి 55 సీట్లు, జనసేనకి 50 సీట్లు వస్తాయని చెప్పారు. ఇక కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, పవన్ కళ్యాణ్ కి ఏ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ పార్టీ అధికారంలోకి ఉంటుంది అని స్పష్టం చేశారు. మరి ఈ హరిరామజోగయ్య సర్వేపై టీడీపీ, వైసీపీ ఎలా రియాక్ట్ అవుతాయనేది చూడాలి.