Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో యాక్టివ్ అవుతున్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికలలో కచ్చితంగా బలమైన స్థానాలలో గెలిచి అధికారంలోకి ఒంటరిగా రావడం లేదంటే, అధికార భాగస్వామ్యం తెచ్చుకోవడం చేయాలని భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే తన వ్యూహాలని సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పడం ద్వారా రాజకీయాలలో పెద్ద చర్చని పవన్ కళ్యాణ్ అవకాశం కల్పించారు. ఇక పవన్ వేసిన ఎత్తులో చిక్కుకున్న వైసీపీ జనసేనపై విమర్శల దాడి తీవ్రతరం చేసింది. జనసేన, టీడీపీ కలిస్తే తమకి నష్టం తప్పదని భావిస్తున్న వైసీపీ అధిష్టానం వీలైనంత వరకు పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేస్తుంది.
ఈ నేపధ్యంలో అన్నిరకాలుగా విమర్శల దాడి పెంచింది. అయితే వైసీపీ నేతల విమర్శలతో ప్రజలలో పవన్ కళ్యాణ్ సింపతీ క్రియేట్ చేసి తనవైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వారాహితో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వారాహి వాహనం సిద్ధం అయిపొయింది. అయితే ఈ యాత్ర ఎప్పుడు ఉంటుంది అనేదానికి తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి నెలలో జనసేన సభ్యుత్వ నమోదుపై దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో సభ్యుత్వ నమోదు సీరియస్ గా చేయించడంతో పాటు పార్టీ ఆవిర్భావ సభని మార్చిలో గ్రాండ్ గా పెట్టబోతున్నారు.
ఇక ఆ సభ తర్వాత ఏప్రిల్ నెలలో పూర్తి స్థాయిలో ప్రజలలోకి వచ్చి వారాహి యాత్రని చేయడానికి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లుతెలుస్తుంది. ఈ లోపు రూట్ మ్యాప్ ని సిద్ధం చేయడంతో పాటు, మ్యానిఫెస్టోపై కూడా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తుంది. అలాగే బూట్ లెవల్ కమిటీలు, మండల, గ్రామ స్థాయి కార్యవర్గాన్ని బలోపేతం చేయడానికి ఇప్పటికే నాయకులకి దిశానిర్దేశ్యం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక వారాహి యాత్రకి సంబంధించి డేట్ ని త్వరలో అనౌన్స్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.