Pawan kalyan : ఖాళీ సమయం దొరికితే చాలు.. జనసేన అధినేత, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్‌లో ఉండటానికే ఇష్టపడతారు. చాలా కాలం క్రితమే ఆయన 16 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. హైదరాబాద్ నగర శివారులోని గండిపేట, చిలుకూరు మధ్య ఈ ల్యాండ్ ఉంది. దీనిలోనే పవన్ ఫామ్ హౌస్‌ను నిర్మించుకున్నారు. ఇక్కడే పలు రకాల పంటలు పండిస్తూ ఉంటారు. అలాగే పశువుల పోషణ కూడా చేస్తున్నారు. విస్తరించిన ఉన్న ఈ ల్యాండ్ లో పవన్ ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు. ఆయన ఇంటర్వ్యూలు చాలా వరకూ కూడా ఫామ్ హౌస్ నుంచే ఇస్తుంటారు.
Pawan kalyan : అత్యాధునిక సౌకర్యాలతో కొత్త ఇంటి నిర్మాణం
ప్రశాంత వాతావరణంలో వ్యవసాయం చేయడం, పశువుల పోషణ చూసుకోవడం అంటే ఆయనకు చాలా ఇష్టం. దీనికి సంబంధించి చాలా వీడియోలు, ఫోటోలు కూడా చూస్తూనే ఉంటాం. అంతేకాదు.. పండ్లను ఆర్గానిక్‌గా పండించడంతో పాటు వాటిని తనకు ఇష్టమైన వారికి పంపి ఆనందిస్తూ ఉంటారు. రెస్ట్ తీసుకోవాలనుకున్నా లేదంటే సినిమా షూటింగ్‌లకు బ్రేక్ దొరికినా.. ఆ సమయంలో రాజకీయాలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవీ లేనప్పుడు.. ఫామ్ హౌస్‌లో పనులు చేస్తూ గడిపేస్తుంటారు. అయితే ఇప్పుడున్న ఫామ్ హౌస్ చిన్నది కావడంతో దానిని కూల్చేసి భారీగా అత్యాధునిక సౌకర్యాలతో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారని టాక్ బీభత్సంగా నడుస్తోంది. ఈ ఫామ్ హౌస్ ధర వింటే షాకవక మానరు.
మార్కెట్ వాల్యూ ప్రకారం పవన్ ల్యాండ్ ఎకరం రూ.10 కోట్లట. ఆ లెక్కన ఆయన మొత్తం పొలం విలువ రూ.160 కోట్లు ఉంటుంది. ఇక పవన్ కడుతున్న ఫామ్ హౌస్ కూడా చాలా రిచ్‌గానే ఉంటుందట. ధర కూడా కోట్ల రూపాయల్లోనే ఉంటుందని టాక్. మొత్తానికి పవన్ తన అభిరుచికి అనుగుణంగా కోట్ల రూపాయలు వెచ్చించి ఫామ్ హౌస్ నిర్మిస్తున్నాడని సమాచారం. అలాగే రాజకీయ అవసరాల కోసం పవన్ కళ్యాణ్ గుంటూరు, మంగళగిరి మధ్య ఓ ఇంటిని నిర్మిస్తున్నారట. అంటే పవన్ ఏక కాలంలో రెండు ఇళ్లు నిర్మిస్తున్నారని తెలుస్తోంది.