Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చి దశాబ్దకాలం అవుతుంది. ఈ దశాబ్ద కాలంలో కనీసం ఎమ్మెల్యేగా కూడా పవన్ పవన్ కళ్యాణ్ గెలవలేకపోయాడు అనేది వైసీపీ నేతలు పదే పదే చేసే విమర్శలు. ఇక ప్రతిపక్ష పార్టీ కూడా పవన్ కళ్యాణ్ కి అభిమానులు తప్ప స్థిరమైన ఓటుబ్యాంకు లేదని పదే పదే చెబుతూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అధికార పార్టీ చేసే వ్యక్తిగత విమర్శలని ఎప్పుడు కూడా సీరియస్ గా తీసుకోరు. తాను వెళ్ళాలనుకున్న దారిలో సూటిగా ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారు. తన వ్యూహాలతో ప్రజలని ప్రభావితం చేసే దిశగా కార్యాచరణని సిద్ధం చేసుకుంటూ వెళ్తున్నారు. రాజకీయ పార్టీ పెట్టినవాళ్ళు తానే ముఖ్యమంత్రి అని చెప్పాలి అని అధికార వైసీపీ పదే పదే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తుంది.
అయితే పవన్ కళ్యాణ్ మద్దతుతో తాము అధికారంలోకి రావాలని టీడీపీ ఎత్తుగడ. అయితే ఈ రెండు పార్టీలకి అందని ఆలోచనలతో పవన్ కళ్యాణ్ రాజకీయ క్షేత్రంలో ప్రజలకి చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆలోచనలని అర్ధం చేసుకోలేని చాలా మంది అప్పటికప్పుడు ప్రతిఫలం ఆశించే వారు పార్టీని వీడి వెళ్ళిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తాను రాజకీయం చేస్తుంది భవిష్యత్తు తరాల కోసం 25 ఏళ్ళ రాజకీయ ప్రయాణం చేయాలని వచ్చాను అని చెబుతున్నారు. పవన్ ని అభిమానించే వారు మాత్రం అతనితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో తాను రాజకీయ పార్టీ పెట్టడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు.

కేవలం ఉద్యోగాలు కోసమే యువత అంతా చదువులు ఉన్నాయని, అయితే చాల మంది సామర్ధ్యం ఉండి విదేశాలకి వలసపోతూ అక్కడ తమ ప్రతిభని చూపించుకుంటున్నారని అన్నారు. ఎంతో మంది ప్రతిభావంతులు యువతలో ఉన్నారని, వారందరినీ వ్యాపారాలుగా, వందల మందికి ఉపాధి కల్పించే విధంగా తీర్చిదిద్దాలనేది తమ అభిమతం అని అన్నారు. నా ఈ ఆలోచన వేరొక పార్టీలోకి వెళ్తే వారికి నిర్దిష్టమైన ఆలోచనలు ఉండటంతో అమలు చేయలేను.
ఈ కారణంగానే ప్రత్యేకంగా పార్టీ పెట్టి సుదీర్ఘ రాజకీయ ప్రయాణం మొదలు పెట్టాను. పార్టీ పెట్టగానే ఫలితం వచ్చేయాలని ఆశించి నేను రాజకీయాలలోకి రాలేదు. దేనిని మొదటిగా అర్ధం చేసుకోవాలి. తరువాత రాజకీయాలలో మన ఆలోచనలని విస్తరిస్తూ ముందుకి వెళ్ళాలి. ఇది ప్రజలకి చేరువ అయ్యి వారిలో మార్పు రావడానికి సమయం పడుతుంది. ఆ సమయం వచ్చే వరకు తన ప్రయాణం కొనసాగుతుంది అని పవన్ కళ్యాణ్ చెప్పడం విశేషం.