Pawan Kalyan: అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫైనల్ ఎపిసోడ్స్ ని పవన్ కళ్యాణ్ తో ఆహా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షోలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ని ఆసక్తికరమైన ప్రశ్నలు వేసారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా అంతే హుందాగా వాటికి సమాధానం చెప్పడం విశేషం. అయితే పవన్ కళ్యాణ్ తన భిడియంతో షోలో చాలా తక్కువ మాట్లాడటం విశేషం. అయినా కూడా నిన్నటి పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని ఏకంగా 100 గంటలు 14 గంటల్లో వీక్షించడం ఇప్పుడు సంచలన రికార్డ్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ షోలో భాగంగా తాను సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం యాదృశ్చికంగా జరిగిందని పేర్కొన్నారు. అల్లు అరవింద్ మా వదిన బాధ భరించలేక నన్ను హీరోని చేసేసారు అని పవన్ కళ్యాణ్ చెప్పడం విశేషం.
అలాగే సుస్వాగతం సినిమా షూటింగ్ సమయంలో వైజాగ్ జగదాంబ సెంటర్ లో బస్సుపై డాన్స్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో చుట్టూ అందరూ నన్ను చూస్తూ ఉంటే చాలా సిగ్గేసింది అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో మా వదినకి ఫోన్ చేసి ఈ మూవీ తర్వాత తాను మరి సినిమాలు చేయనని చెప్పెసినట్లు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. అలాగే రాజకీయాలలో మూడు పెళ్ళిళ్ళపై పవన్ కళ్యాణ్ ని బాలకృష్ణ ప్రశ్నించాడు. ఈ సందర్భంగా మూడు పెళ్ళిళ్ళు తాను చట్టబద్ధంగా విడాకులు ఇచ్చి చేసుకున్నా అని తెలిపాడు.

అయితే విమర్శించే వారికి తనను అనడానికి మరింకేం లేకపోవడంతో ఆ వ్యవహారాన్ని పదే పదే విమర్శిస్తున్నారని అన్నారు. ఇక నన్ను విమర్శించే వారిలో చాలా మంది భాగోతాలు నాకు తెలుసని, అయితే వారి ఇంట్లో ఆడపడుచుల గురించి ఆలోచించి ఆగిపోతానని అన్నారు. అయితే తనని విమర్శించడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి వారు విమర్శిస్తున్నారు. నేను కూడా అందుకే పట్టించుకోకుండా వదిలేసాను అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ మొదటి ఎపిసోడ్ పార్ట్ 1లో ఆసక్తికర విషయాలు పంచుకున్నారని చెప్పొచ్చు.