పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో తొలిప్రేమ సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరియర్ ని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీగా నిలిచింది. ఇక ఆ సినిమాతో పవన్ కళ్యాణ్ కి యూత్ లో విశేషమైన క్రేజ్ రావడంతో పాటు అమ్మాయిల కలల రాకుమారుడుగా కూడా మారిపోయాడు. ఏ కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1998 జులై 24న రిలీజ్ అయ్యింది. ఆ ఏడాదిలో టాప్ టెన్ హిట్ చిత్రాలలో తొలిప్రేమకి మొదటి స్థానం ఉంది. పవన్ కళ్యాణ్ కెరియర్ గురించి చెప్పుకుంటే కచ్చితంగా తొలిప్రేమకి మొదటి స్థానం ఉంటుంది. పవర్ స్టార్ లో పూర్తి స్థాయిలో నటుడుని ఆవిష్కరించిన చిత్రంగా ఇది నిలిచింది. ఇప్పటికి తెలుగు క్లాసిక్ మూవీస్ లో తొలిప్రేమకి మంచి స్థానం ఉంటుంది.
అలాగే ఆ ఏడాది జాతీయ ఉత్తమ చిత్రంగా కూడా ఇది నిలవడం విశేషం. ఇలాంటి సినిమా ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి కారణం ఈ సినిమా 24 ఏళ్ళు పూర్తి చేసుకోవడం. 24 ఏళ్ల క్రితం ఇదే రోజున థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఇక మొదటి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని వంద రోజుల వరకు నిర్విరామంగా కొనసాగింది. పవన్ కళ్యాణ్ కెరియర్ కి కూడా ఈ సినిమా మంచి ఊపు తీసుకొచ్చింది. నిజమైన ప్రేమకి గొప్ప అర్ధం చెప్పిన చిత్రంగా ఇది నిలిచిపోయింది.
చాలా ప్రేమ కథ చిత్రాలకి ఇది ఒక ఇనిస్పిరేషన్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ కి జోడీగా ఈ సినిమాలో కీర్తి రెడ్డి నటించింది. ఇక దర్శకుడు కరుణాకరన్ కి కూడా ఇదే మొదటి సినిమా కావడం విశేషం. దీని తర్వాత అతని క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ కెరియర్ లో 24 ఏళ్ళు పూర్తి చేసుకున్న సినిమా కావడంతో ట్విట్టర్ లో ఈ సినిమా ట్రెండింగ్ లో కొనసాగుతుంది . పవర్ స్టార్ అభిమానులు సినిమాని మరోసారి గుర్తుచేసుకుంటూ వైరల్ చేస్తున్నారు. 24ఇయర్స్ ఫర్ తొలిప్రేమ పేరుతో హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవ్వుతుంది