జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చురుకుగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికలని లక్ష్యంగా చేసుకొని తన రాజకీయ వ్యూహాలు, కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీలో బలమైన స్థానాలని కైవసం చేసుకోవడం ద్వారా ప్రభుత్వంలో భాగాస్వామ్యం కావాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అలాగే తెలంగాణలో కూడా తామకి బలం ఉన్న స్థానాలలో పోటీ చేయాలని జనసేనాని భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే తన బలాబలాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. తెలంగాణలో కూడా కొన్ని బలమైన స్థానాలలో జనసేన బరిలోకి దిగుతుందని పవన్ కళ్యాణ్ గతంలో చెప్పడంతో పాటు తెలంగాణ నాయకులకి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ నేపధ్యంలో తన వారాహి యాత్రని ముందుగా తెలంగాణలో మొదలు పెట్టడానికి పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారు.
అందులో భాగంగా ఈ నెల 24న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. అనంతరం పార్టీ తెలంగాణ నాయకులతో సమావేశమై తన రాజకీయ కార్యాచరణని ప్రకటించబోతున్నారు. తెలంగాణలో నరసింహయాత్ర పేరుతో పుణ్యక్షేత్రాల దర్శన యాత్రని పవన్ కళ్యాణ్ తన రాజకీయ పర్యటనలో భాగంగా మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. సుమారు 35 నియోజకవర్గాలలో ఈ యాత్ర ఉంటుందని తెలుస్తుంది. అది ముగిసిన తర్వాత ఏపీలో చేపట్టబోయే యాత్రకి కూడా నరసింహ యాత్ర అనే పేరునే పెట్టినట్లు తెలుస్తుంది.
రాయలసీమలో నుంచి ఉత్తరాంద్ర వరకు అన్ని జిల్లాలలో బస్సు యాత్ర చేస్తూ ఏపీలో 31 నరసింహ క్షేత్రాల దర్శనం పవన్ కళ్యాణ్ చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఈ యాత్రకి ఆ పేరు పెట్టి మొదలు పెట్టడం వెనుక పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక ఎత్తుగడ ఉండనే మాట వినిపిస్తుంది. వైసీపీ అధిష్టానం తన యాత్రకి భంగం కలిగించే ప్రయత్నం చేస్తే దానిని రిలీజియన్ వైపు డైవర్ట్ చేసి జగన్ రెడ్డిని దెబ్బకొట్టే ఛాన్స్ వస్తుంది. అలా అని పర్యటనకి అడ్డుపడకుండా వదిలేస్తే తమ విమర్శలతో నాయకులని ఇరుకున పెట్టడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది. ఎటొచ్చి వైసీపీని తమ వారాహి రథయాత్రతో పవన్ కళ్యాణ్ రెండు విధాలుగా కార్నర్ చేసాడనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.