బండ్ల గణేష్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ బర్త్డే స్పెషల్ గా రీ రిలీజ్ చేయబోయే సినిమాల మీద చర్చ జరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్తడే నాడు సినిమాను రిలీజ్ చేసి వాటి ద్వారా వచ్చిన డబ్బును జనసేనకు విరాళంగా నిర్మాతలు ఇస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇక ఈసారి గుడుంబా శంకర్ సినిమాను రీ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లు వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. ఇది నాగబాబు నిర్మించిన సినిమా అని అందరికీ తెలిసిందే అయితే తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
పవన్ కళ్యాణ్ బర్తడే కి గబ్బర్ సింగ్ రిలీజ్ చేసి తన స్టామినా ఏంటో చూపిస్తానని బండ్ల గణేష్ ట్వీట్ చేయగా దీంతో పవర్ స్టార్ అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బర్తడే సందర్భంగా గుడుంబా శంకర్ సినిమా ని రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మధ్యలో వేలు పెట్టకండి లేదా మాట్లాడుకొని గబ్బర్ సింగ్ అయినా ప్లాన్ చేయండి అంటూ ఒక అభిమాని కామెంట్ చేశాడు.. మరొకరేమో మూసుకొని ఉండన్న.. ఆల్రెడీ గుడుంబా శంకర్ ఉంది కదా.. దానివల్ల వచ్చే డబ్బే మన పార్టీకి ఇప్పుడు వాడుతారు.. కావాలంటే ఈ సినిమా వచ్చే ఏడాది వేసుకొండి అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
అయితే బండ్ల గణేష్ ట్వీట్ కి హరీష్ శంకర్ స్పందించాడు. ఏం వార్త చెప్పావన్నా.. సరే ఈ సినిమా రిలీజ్ చేద్దామని హరీష్ శంకర్ రిప్లై ఇచ్చారు .. అన్నావద్దు ఆల్రెడీ గుడుంబా శంకర్ సినిమా వస్తోంది ..నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేయండి అంటూ హరీష్ ను నెటిజన్స్ రిక్వెస్ట్ చేసారు . ఏది ఏమైనా బండ్ల గణేష్ మధ్యలో దూరాడన్న కామెంట్లు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి.