Payal Rajput: ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాతో ఆమె నటిగా, అలాగే గ్లామర్ క్వీన్ గా తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ పెర్ఫార్మెన్స్ కి అందరూ కనెక్ట్ అయిపోయారు. అలాగే ఆమె అందానికి కూడా ఫిదా అయిపోయారు. ఆ తరువాత పాయల్ రాజ్ పుత్ ఆశించిన స్థాయిలో అవకాశాలని సొంతం చేసుకోలేదని చెప్పాలి. హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా కూడా మెజారిటీ ఆమె చేసిన సినిమాలలో చాలా వరకు గ్లామర్ రోల్స్ ని పోషించింది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు చేతిలో ప్రస్తుతం తెలుగులో అయితే ఎలాంటి సినిమాలు లేవు. మాతృభాష పంజాబీలో మాత్రం సినిమాలు చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా బాయ్ ఫ్రెండ్ తో కాలక్షేపం చేస్తూ ఆ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇక తాజాగా ఈ అమ్మడుకి మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. మొదటి సినిమా తెలుగులో అవకాశం ఇచ్చిన అజయ్ భూపతి దర్శకత్వంలోనే మళ్ళీ నటించే ఛాన్స్ ని ఈ అమ్మడు సొంతం చేసుకుంది.
ఆర్ఎక్స్ 100 తర్వాత శర్వానంద్, సిద్దార్ద్ కాంబినేషన్ లో మహా సముద్రం అనే సినిమా చేసిన అజయ్ భూపతి ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే చాలా గ్యాప్ తర్వాత మరల కొత్తవాళ్లతో మంగళవారం అనే హర్రర్ థ్రిల్లర్ మూవీని చేస్తున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథాంశం ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం పాయల్ రాజ్ పుత్ ని అజయ్ భూపతి ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది.