కుప్పం నియోజకవర్గం అంటే టీడీపీ కంచుకోట అని చెప్పాలి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలలో ఏదో దౌర్జన్యాలు చేసి కుప్పం మున్సిపల్ కార్పోరేషన్ సొంతం చేసుకున్న వైసీపీ అధిష్టానం అదేదో ప్రజలు తమకి గొప్పగా ఇచ్చిన బలంగా ఊహించుకోవడం మొదలుపెట్టింది. జగన్ రెడ్డికి కూడా కుప్పం నేతలు, పెద్ది రెడ్డి అందరూ ప్రజలు మన అభివృద్ధిని చూసి కుప్పంలో వైసీపీని గెలిపించారు అంటూ చెప్పినట్లు ఉన్నారు. ఈ నేపధ్యంలో ప్రతిసారి కుప్పంలో గెలిచాం కాబట్టి 175 సీట్లు ఈ సారి మనవే అంటూ జగన్ రెడ్డి పార్టీ నాయకులకి ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పేస్తున్నారు. అయితే గ్రౌండ్ లెవల్ రియాలిటీ అనేది జగన్ రెడ్డికి తెలిసే అవకాశం లేదనేది రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. సభలో డ్వాక్రా మహిళలని బెదిరించి భయపెట్టి తరలిస్తారు.
అలాగే రోడ్డు మీద వెళ్ళే సమయంలో సమస్యలు కనిపించకుండా పరదాలు అడ్డు పెడతారు. ప్రతిపక్షాలని ముందుగానే హౌస్ అరెస్ట్ చేసి నిర్భందిస్తారు. ఇవన్ని చేసి దర్జాగా వచ్చి మీటింగ్ లో దుష్టచతుష్టయం అంటూ సభకి వచ్చే ప్రజలకి అర్ధం కాని సభాషణలు చెబుతూ, పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు, చంద్రబాబు మామకి వెన్నుపోటు అంటూ ఒకే పాటని అదే పనిగా పాడుతూ జగన్ రెడ్డి ముందుగానే ఇచ్చిన స్క్రిప్ట్ చదివేసి వెళ్ళిపోతారు. అయితే గ్రౌండ్ లెవల్ లో ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత ఉందో అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం మాత్రం నాయకత్వం చేయలేదు. ఒక వేళ సమస్యలపై ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేయడం పరిపాటిగా మారిపోయింది.
ఇదిలా ఉంటే తాజాగా పెద్దిరెడ్డికి చంద్రబాబుపై ఉన్న ద్వేషాన్ని అవకాశం దొరికిన ప్రతిసారి చూపిస్తూ వస్తున్నారు. తాజాగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ జగన్ ఆదేశిస్తే కుప్పంలో చంద్రబాబు మీద పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే పెద్దిరెడ్డికి పుంగనూరు, పీలేరు వదిలి వచ్చే ధైర్యం అస్సలు లేదని, ఆ రెండింట్లో తప్ప ఎక్కడ పోటీ చేసిన కూడా పెద్దిరెడ్డికి డిపాజిట్లు కూడా రావనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అయితే జగన్ మెప్పు పొందాలనే ప్రయత్నంలోనే పెద్దిరెడ్డి ఇలాంటి అనవసరమైన చాలెంజ్ లు చేస్తూ చంద్రబాబుని భయపెడుతున్న అనే స్థాయిలో చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారనే మాట రాజకీయ వర్గాలలో చర్చించుకుంటున్నారు.