Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విధానాలపై అధికార పార్టీ విమర్శలు చేస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ మీడియా ముందుకి వస్తే ఎంత సేపు జగన్ పైన ద్వేషాన్ని చూపిస్తూ ఉంటారు. జగన్ ని ఎలా గద్దె దించాల అనే విషయంపైన తన ప్రసంగం ఉంటుంది. వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం, అదే సమయంలో చంద్రబాబుని వెనకేసుకొని రావడం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో భాగంగా ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ చేసే ప్రసంగాలతో వైసీపీ నాయకులకి అడ్డంగా బుక్ అయిపోతూ ఉంటారు. ప్రతి విమర్శలకి అవకాశం ఇస్తారు. ఈ నేపధ్యంలోనే కాపు సంఘం మీటింగ్ లో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై తాజాగా పేర్ని నాని మీడియా ముందుకి వచ్చి విమర్శలు చేశారు.
పవన్ కళ్యాణ్ ఆలోచనాధోరణి పైన కౌంటర్లు వేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయ నటనకి ఆస్కార్ అవార్డులు ఇవ్వొచ్చు అని పేర్ని నాని కౌంటర్ వేశారు. తన కులంవాళ్లు ఓటేస్తే నేను ఓడిపోయేవాడినే కాదని పవన్ అంటున్నాడు.. అసలు రాజకీయ నేతకు, ప్రజా నాయకుడికి ఉన్న వ్యక్తి ఎక్కడైనా అలా మాట్లాడుతాడా: ఒక్క కులం ఓట్లు వేస్తే చట్టసభలకు వెళ్లాలని అనుకుంటారా అని ప్రశ్నించారు. ఒక్క కులం ఓట్లతో కుల నేత అవుతారు.. ప్రజా నేత కాదని స్పష్టం చేశారు. చంద్రబాబు బాగుండాలనేదే పవన్ కల్యాణ్ అంతిమ లక్ష్యమని పేర్ని నాని విమర్శించారు. లోపాయికారీ ఒప్పందాలకు పవన్ స్పెషలిస్ట్ అని పేర్ని నాని విరుచుకుపడ్డారు.
రాజకీయం ప్రారంభించడమే టీడీపీతో లోపాయకారి ఒప్పందం చేసుకొని మొదలెట్టారని అన్నారు. అలాగే 2019 ఎన్నికలకి ముందు వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదు అని బయటకొచ్చి నాటకాలు ఆడారు. 2019 తర్వాత బీజేపీతో కలిసి ఒప్పందం చేసుకున్నారు. తప్పుడు రాజకీయాలు చేయడంలో చంద్రబాబుతో పవన్ పోటీపడుతున్నాడని దుయ్యబట్టారు. కాపులను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేందుకే పవన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడరని విమర్శించారు. అసలుస ఒస్హళ్ ఇంజనీరింగ్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి అయితే సామాజిక న్యాయం జరగదని, కులాలలో ఉన్న యువత ఆర్ధికంగా అభివృద్ధి చెందితే జరుగుతుందని పేర్ని నాని అన్నారు.