PM Modi : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అందరి ఫేవరేట్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించిన పఠాన్ సినిమాను అనే వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా నుంచి విడుదలైన బేషరమ్ సాంగ్‌పైన సోషల్ మీడియాలో నెగెటివిటీ స్ప్రెడ్ అయ్యింది. బీజేపీ నేతలు పఠాన్ సినిమా బహిష్కరణకు పిలుపు ఇవ్వడం, నిరసనలు చేపడుతున్న క్రమంలో సాక్షాత్తు దేశ ప్రధాని రంగంలోకి దిగి సినిమాలపై అనవసర వ్యాఖ్యలు మానుకోవాలని పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు.

సినిమాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల బీజేపీ కార్యకర్తలను కోరారు. ఇప్పుడు, జరుగుతున్న పఠాన్ గొడవల మధ్య ప్రధాని మోదీ ప్రకటనకు ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న చిత్రనిర్మాత అశోక్ పండిట్ మద్దతుగా నిలిచారు. తమ పార్టీ సభ్యులకు ప్రధాని మోదీ చేసిన హెచ్చరిక సినిమా పరిశ్రమకు పెద్ద నమ్మకాన్ని పెంచింది అని ఆయన అన్నారు.
రామ్ కదమ్ , నరోత్తమ్ మిశ్రా వంటి పలువురు బిజెపి నాయకులు ఇటీవల పఠాన్ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. బేషరమ్ రంగ్ పాటలో దీపికా పదుకొణె నారింజ స్విమ్‌సూట్ కు అభ్యతరం తెలిపడంతో పాటు మేకర్స్‌ను విమర్శించారు. సినిమాను అడ్డుకుంటామని పాటలో సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. దీపికా డ్రెస్ పైన ఆంక్షలు పెట్టారు. గతేడాది విడుదలైన ఈ సాంగ్ పెద్ద దుమారాన్నే రేపింది. రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సభ ముగింపు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ నేతలు చేయాల్సినవి, చేయకూడనివి పనులు ఏమిటో స్పష్టంగా తెలిపారు. తన సందేశంలో, సినిమాలు వంటి అసంబద్ధమైన విషయాలపై అనవసరమైన వ్యాఖ్యలు చేయవద్దని ఆయన తన పార్టీ సభ్యులను హెచ్చరించారు.

గత కొన్ని నెలలుగా, దేశంలో అనేక బాలీవుడ్ సినిమాలకు వ్యతిరేకంగా ఒక వర్గం నాయకులు సోషల్ మీడియా వినియోగదారులతో బాయ్‌కాట్ కాల్‌ను విస్తృతం చేసింది. ఇటీవల, పఠాన్‌లోని బేషరమ్ రంగ్ పాటపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు, కొందరు దీపికా పదుకొణె ధరించిన దుస్తులను చూపిస్తూ, ఈ పాట మత మనోభావాలను దెబ్బతీస్తుంది అని పేర్కొన్నారు. ఈ సినిమా నిర్మాతలు, నటీనటులపై పలు కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పాట డర్టీ మైండ్‌సెట్ ను ప్రతిబింబిస్తోందని వాదిస్తూ, బిజెపి నాయకుడు నరోత్తమ్ మిశ్రా గతంలో సినిమా టైటిల్ కూడా అభ్యంతరకరమైనది అని అన్నారు. అంతకుముందు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పఠాన్ చిత్రాల నిర్మాతలను సినిమాలోని పాటలతో సహా మార్పులను అమలు చేయాలని ఆదేశించింది. జాన్ అబ్రహం కూడా నటించిన పఠాన్ జనవరి 25న థియేటర్లలో విడుదల కానుంది. దీనికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.