అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు చాలా విచిత్రంగా జరుగుతాయి. వాటి గురించి బయటకి తెలిసినపుడు అవి కాస్తా వైరల్ అవుతాయి. అలాంటి సంఘటనలు తరుచుగా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి సంఘటన ఒకటి మాంచెస్టర్ లో జరిగింది. ఒక దొంగ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కొత్తగా ట్రై చేశాడు. అయితే పోలీసుల అతని తెలివికి ఫుల్ స్టాప్ పెట్టి అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఈ మధ్యకాలంలో కార్టూన్ క్యారెక్టర్స్ తో షాపింగ్ మాల్స్ దగ్గర ప్రచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలా ఆ దొంగ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి టెడ్డీబేర్ లోకి దూరిపోయాడు. జాషువా డబ్బన్ అనే యువకుడు దొంగతనాలు చేస్తూ తప్పించుకునే వాడు.
ఎప్పటిలాగే తాజాగా ఓ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకొని డబ్బులు కట్టకుండా ఎస్కెప్ అయ్యాడు. అంతకు ముందే ఒక కారుని కూడా దొంగతనం చేశాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు అన్ని ప్రయత్నాలు చేశారు. చివరికి ఆతని ప్రియురాలి ఇంటికి వెళ్లారు. అయితే ముందుగా అతను లేడని ఆమె పోలీసులకి చెప్పే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు మాత్రం ఆమె ఇల్లు మొత్తం వెతికారు. ఎక్కడ దొంగ జాడ కనిపించలేదు. పోలీసులు వెళ్లిపోతున్న సమయంలో ఓ టెడ్డీ బేర్ నుంచి శ్వాస రావడం వారికి కనిపించింది.
దీంతో దానిని విప్పి చూడగా అందులో జాషువా ఉన్నాడు. అయితే టెడ్డీ బేర్ లో ఉండటం వలన అతను ఊపిరాడక సొమ్మసిల్లిపోయాడు. ముందుగా పోలీసులు అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేసి తరువాత కోర్టుకి తరలించారు. అక్కడ అతనికి తొమ్మిది నెలల శిక్ష పడింది. అలాగే డ్రైవింగ్ చేయకుండా 27 నెలల పాటు నిషేధం విధించారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి జాషువా టెడ్డీ బేర్ వెనక జిప్పు తీసి అందులో సగం ఫోమ్ తీసేసి దూరిపోయాడు. ఈ విషయాన్ని పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.