సమాజంలో ఎంత బాధ్యాతాయుతమైన హోదాలో ఉన్నా కూడా వారు కూడా మనుషులే వారిలో భావోద్వేగాలు ఉంటాయి. ఆనందం అనిపించినపుడు దానిని ఆశ్వాదించడం, బాధ అనిపించినపుడు దానిని వ్యక్తం చేయడం చేస్తూ ఉండాలి. అలా చేస్తేనే మనలో ఉండే ఒత్తిడి దూరం అవుతుంది. అలా కాకుండా అన్ని ఎమోషన్స్ ని లోపలే దాచేసుకుంటే ఏదో ఒక రోజు మానసికంగా ఇబ్బందులకి గురి కావాల్సి వస్తుంది. అయితే సొసైటీలో ఏదైనా ఒక హోదాలో ఉన్నారు అంటే వారు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని ఎవరికి వారే కండిషన్స్ పెట్టేస్తారు. అలాంటి కండిషన్స్ పెట్టి వారిని ఒక చట్రంలో బంధించే ప్రయత్నం చేస్తారు.. అయితే కొంత మంది మాత్రం వాటిని దాటుకొని వచ్చి తమకి నచ్చినట్లు ఉండే ప్రయత్నం చేస్తారు.
जब दारोगा जी बने सपेरा, नागिन कांस्टेबल को अपनी बीन पर नचाया।😂 pic.twitter.com/eVHCx3hJgo
— Jaiky Yadav (@JaikyYadav16) August 16, 2022
తాజాగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇద్దరు పోలీసులు తమ ఆనందాన్ని డాన్స్ రూపంలో వ్యక్తం చేశారు. ఆ రోజు ప్రతి ఒక్కరు దేశభక్తి భావాన్ని మనసులో నింపుకొని ఉంటారు. దీంతో కాస్తా ఉత్సాహంగా కూడా ఉంటారు. ఈ నేపధ్యంలో స్వాతంత్య్ర దినోత్సవం పరేడ్ అయిపోయిన తర్వాత ఇద్దరు పోలీసులు నాగిని డాన్స్ వేస్తూ సందడి చేశారు. వారి చుట్టూ ఉన్న మిగిలిన పోలీసులు కూడా ఆ ఇద్దరిని చప్పట్లతో ఉత్సాహపరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చి వైరల్ గా మారింది. వారి డాన్స్ చూసిన చాలా మంది పాజిటివ్ గానే రెస్పాన్స్ అయ్యారు. వారి టాలెంట్ ని గుర్తించే ప్రయత్నం చేస్తూ ప్రశంసించారు. అయితే కొందరు మాత్రం పోలీస్ యూనిఫామ్ లో ఉండి అలా ఎలా డాన్స్ చేస్తారు అంటూ కామెంట్స్ చేశారు.. ఈ ఘటన యూపీలోనే కొత్వాలీ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనపై పురాన్‌పూర్ పోలీస్ బాస్ రెస్పాండ్ అయ్యారు. దీనిపై తమకి ఎలాంటి ఫిర్యాదు రాలేదని, ఒక వేళ వస్తే విచారణ జరిపి తప్పని తేలితే చర్యలు ఉంటాయని తెలిపారు.