కిరాతకంగా హత్యా చేసిన పోలీస్
కుటుంబ సమస్యలపై మనస్పర్థలు రావడంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ తన భార్యను గొంతు కోసి మొదటి అంతస్తు నుండి కింద పడేసి హత్య చేశాడు.
శుక్రవారం హైదరాబాద్‌లోని గౌతమి నగర్‌లోని వారి నివాసంలో కానిస్టేబుల్ కె. రాజ్‌కుమార్ తన భార్య శోబ (40)ని వెంబడించి కత్తితో గొంతు కోసాడు. ఆపై వారి భవనం మొదటి అంతస్తు నుండి కింద పడేసాడు.
ఈ ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పరారీ లో పోలీస్ కానిస్టేబుల్
తండ్రిని ఆపే ప్రయత్నంలో దంపతుల పెద్ద కుమారుడు స్వాతిక్ (15) గాయపడ్డాడు. స్వాతిక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య చేసి తప్పించుకున్న కానిస్టేబుల్ కోసం గాలిస్తున్నారు.
హైకోర్టులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రాజ్‌కుమార్‌కు భార్యతో విభేదాలు వచ్చాయి. రెండు రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో కుటుంబ పెద్దలు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు.
శుక్రవారం దంపతుల మధ్య ఏదో విషయమై తీవ్ర వాగ్వాదం జరగడంతో కోపోద్రిక్తుడైన రాజ్‌కుమార్ ఆమెను కొట్టడం ప్రారంభించాడు. ఆమె తనను తాను రక్షించుకోవడానికి మెట్లు దిగి పరుగెత్తడం ప్రారంభించగా, అతను కత్తితో ఆమెను వెంబడించి గొంతు కోసి, తన ఇంటి పై నుంచి తోసేసాడు.
హత్యా కు గల కారణం
భార్యకు అక్రమ సంబంధం ఉందాని అనుమానంతోనే రోజు గొడవలు జరిగేవని స్థానికులు చెప్పారు. అలాగే కానిస్టేబుల్ రాజ్ కుమార్ కి కూడా ఒక యువతితో అక్రమ సంబంధం ఉందని మరికొందరు చెబుతున్నారు. ఇద్దరి అక్రమ సంబంధాలే వివాదాలకు ధరి తీసి హత్యకు కారణమయ్యాయి.
ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. ఎల్‌బీనగర్ డీసీపీ సాయిశ్రీ నేతృత్వంలోని పోలీస్ బృందం ఘటన స్థలాని పరిశీలిస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ దర్యాప్తు చేస్తున్నారు.
