ఏపీలో రాజకీయ సమీకరణాలు. పార్టీల వ్యూహాలు రోజు రోజుకి పదునెక్కుతున్నాయి. ఎవరికి వారు వచ్చే ఎన్నికలని దృష్టిలో ఉంచుకొని ఏ పంథాలో వెళ్తే ప్రజలని ఎట్రాక్ట్ చేయవచ్చు అనేది ఆలోచించుకుంటూ వారు వారు వేసుకున్న ప్లాన్స్ తో ముందుకి వెళ్తున్నారు. వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకురావడమే కాకుండా విశాఖ పరిపాలన రాజధాని పరిపాలన రాజధాని అంటూ చెబుతున్నారు. అలాగే ఉగాది నుంచి విశాఖ నుంచి పరిపాలన సాగించే ప్లాన్ లో ఉన్నట్లు కూడా ఆ పార్టీ నాయకులు క్లారిటీ ఇస్తున్నారు. విశాఖ రాజధాని కాకుండా ఎవరూ అడ్డుకోలేరని అంటున్నారు. ఇక విశాఖని రాజధాని చేయడం ద్వారా ఉత్తరాంద్రలో మెజారిటీ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుంది అనే భావనతో వైసీపీ అధిష్టానం ఉంది. అయితే ఉత్తరాంద్రలో రాజకీయ సమీకరణాలు పూర్తి విరుద్ధంగా ఉంటాయి.
అక్కడి ప్రజలు స్థానిక నాయకత్వానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. స్థానికంగా ఉన్న నాయకుడు ఎంత బలంగా తమ సమస్యలని పరిష్కరించగలడు అనేది చూస్తారు. ప్రాంతీయ తత్త్వం, కుల తత్త్వం అస్సలు ఉండదు. ఇదిలా ఉంటే మరో వైపు బీజేపీ కూడా విశాఖపైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అందులో భాగంగా జీ20 సదస్సు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మౌలిక వసతుల కల్పనలో కూడా బీజేపీ ఫోకస్ అంతా విశాఖమీదనే ఉంది. మరోవైపు జనసేన పార్టీ కూడా గ్రౌండ్ లెవల్ లో పార్టీ బలం పెంచుకునే ప్రయత్నం మొదలు పెట్టింది. ఎక్కడైతే ఓడిపోయామో మళ్ళీ అక్కడే సాధించుకోవాలని జనసేనాని ఆలోచిస్తున్నారు. విశాఖ ఓటర్స్ ఆలోచించి ఓట్లు వేస్తారని భావిస్తున్నారు.
అందులో భాగంగా ఇతర పార్టీలలో ఉన్న వైసీపీ నాయకులని జనసేనలోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగ వైసీపీ కార్పొరేటర్ కందుల నాగరాజు వైసీపీలో చేరారు. మరికొంత మంది కీలక నేతలు జనసేనలోకి చేరడానికి రెడీ అవుతున్నారు. ఇక టీడీపీకి విశాఖ పెట్టని కోటలాంటిది. ఆ పార్టీకి బలమైన నాయకులు ఆయా నియోజకవర్గాలలో ఉన్నారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి వెళ్ళారు. అయితే వైసీపీలో ఆయన ఇమడలేకపోతున్నారు అనేది స్థానికంగా వినిపిస్తున్న మాట. టీడీపీ తన బలం నిరూపించుకోవడం ద్వారా విశాఖ పరిపాలనా రాజధానిగా ఎవరూ ఒప్పుకోవడం లేదని చూపించాలని అనుకుంటుంది. అయితే వైసీపీ మాత్రం అన్ని రకాల స్ట్రాటజీలతో విశాఖని ఐటీ హబ్ గా మారుస్తామని, పరిపాలన మొదలైతే పెట్టుబడులు పెరుగుతాయని భావిస్తున్నారు. మరి ఎవరికి వారు విశాఖ కేంద్రంగా నడుపుతున్న రాజకీయాలు ఎవరిని తీరానికి చేరుస్తాయో అనేది చూడాలి