TS Politics: తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ, మరో వైపు బీజేపీ పార్టీ ఈ సారి గట్టిగా పోటీ పడే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. కచ్చితంగా ఈ సారి తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ పార్టీ భావిస్తుంది. దానికి తగ్గ వ్యూహాలని సిద్ధం చేసుకుంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో గెలిపించే బాద్యతలని ఇప్పుడు కేసీఆర్ తనయుడు కేటీఆర్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక మరో ఆరు నెలలలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే మాట తెలంగాణ రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో ఎవరికి వారు తమ ప్రచార కార్యక్రమాలని ముమ్మరం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు.

అలాగే వైఎస్ఆర్టీపీతో ముఖ్యమంత్రి కావాలని వైఎస్ షర్మిల అడుగులు వేస్తుంది. మరో వైపు బీజేపీ ఈ సారి పీఠాన్ని వదిలే ప్రసక్తి లేదని సీరియస్ గా పోరాటం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరరెడ్డి బీఆర్ఎస్ కి దూరమై ఎన్నికల ముందు ఏదో ఒక పార్టీలో చేరాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే బీజేపీలో ఆయన డిమాండ్స్ కి అవకాశం లేకపోవడంతో ఇప్పుడు వైఎస్ఆర్ టీపీలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటికే షర్మిల, విజయమ్మని అతను కలిసారు. దీంతో వైఎస్ఆర్టీపీలోకి పొంగులేటి రావడం ఖాయం అయిపొయింది.
అయితే ఊహించని విధంగా తాజాగా ఆయన ఏపీలో తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ తో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జలరామకృష్ణారెడ్డితో కూడా పొంగులేటి భేటీ అయ్యారు. పొంగులేటి భేటీతో వైఎస్ షర్మిల జగన్ తో విభేదించి తెలంగాణలోకి వచ్చింది అనే టాక్ కి ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది. ఏపీలో జగన్ రెడ్డి, తెలంగాణలో వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలని వారి వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగానే ఆమె తెలంగాణలోకి వచ్చిందనే మాట తెరపైకి వచ్చింది. వైసీపీకి తెలంగాణలో ఎలాగూ ఛాన్స్ లేదు కాబట్టి షర్మిలకి అక్కడ దింపినట్లు తెలుస్తుంది. షర్మిల జగనన్న వదిలిన బాణంగానే తెలంగాణలో రాజకీయాలు చేస్తుందని ఇప్పుడు తెలంగాణ నాయకులకి స్పష్టత వచ్చినట్లుగా తెలుస్తుంది.