Pooja Hegde : సౌత్ బ్యూటీ పూజా హెగ్డే సోదరుడు రిషబ్ హెగ్డే వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తన స్నేహితురాలు శివాని శెట్టిని ప్రేమించి పెద్దల సమక్షంలో సంప్రదాయంగా పెళ్లి చేసుకున్నాడు రిషబ్ . ఈ పెళ్లి తంతులో పాల్గొని తన సోదరుడి పెళ్లిలో సందడి చేసింది పూజా హెగ్దే. తాజాగా నటి తన సోదరుడి వివాహానికి సంబంధించిన కొన్ని పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
పూజా హెగ్డే తన సోదరుడి పెళ్లికి నారింజ రంగు కంజీవరం చీరను ధరించింది అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది. పనిలో పనిగా ఈ చీరకట్టుతో అద్భుమైన ఫోటో షూట్‌ను చేసింది పూజా హెగ్దే. నటి ఎంబ్రాయిడరీ చేసిన హాఫ్-స్లీవ్ బ్లౌజ్ వేసుకుని దానికి జోడీగా నారింజ రంగు బంగారు అలంకారాలతో వచ్చిన కాంజీవరం చీరను కట్టుకుంది.
ఈ చీరకోసం కాంట్రాస్ట్ జ్యువెల్లరీని ఎన్నుకుంది పూజా. నారింజ రంగు చీరకు మ్యాచ్ అయ్యేలా గ్రీన్ స్టోన్స్ , పెర్ల్ డిటైలింగ్‌తో వచ్చిన భారీ స్టేట్‌మెంట్ నెక్‌లెస్‌ను ఆమె మెడలో అలంకరించుకుంది. నెక్‌లెస్‌కు మ్యాచ్ అయ్యే ఇయర్‌రింగ్స్‌ను , నుదుటన పాపిట బిల్లను పెట్టుకుంది. పూజా సాంప్రదాయ దుస్తులకు ఈ నగలు మరింత ఆకర్షణను జోడించాయి. ఆమె పొడవాటి జడను పూలతో అలంకరించుకుని అందంగా ఫోటోలు దిగింది.
పూజ మెరుస్తున్న చర్మాన్ని మరింత హైలెట్ చేసేందుకు బుగ్గలను బ్లష్ చేసింది. కను రెప్పలపై గులాబీ షేడ్స్ వేసుకుంది. కనులకు మస్కరా, ఐ లైనర్ దిద్దుకుంది. పెదాలకు నారింజరంగు లిప్‌స్టిక్ దిద్దుకుని నుదుటన బొట్టు పెట్టుకుని తన లుక్ ను పూర్తి చేసింది.
ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన పిక్స్‌కు నటి అందమైన క్యాప్షన్‌ను జోడించింది. నా సోదరుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇది ఒక వారం రోలర్‌కోస్టర్! నేను సంతోషంగా కన్నీళ్లు పెట్టుకున్నాను అలాగే చిన్నపిల్లలా నవ్వాను. అన్నా, మీరు మీ జీవితంలో మరో దశలోకి అడుగుపెడుతున్నప్పుడు, మీరు అపరిమితంగా ప్రేమిస్తారని నేను ఆశిస్తున్నాను అని అంది అదే విధంగా వదిన శివానీ గురించి చెబుతూ మీరు అందమైన అద్భుతమైన వధువు, మా కుటుంబానికి స్వాగతం అని పూజా క్యాప్షన్‌ను జోడించింది.