Prabhas : పాన్ ఇండియన్ స్టార్ ఆదిపుష్ ప్రభాస్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడా? బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నాడా ? అంటే ప్రస్తుతం టాలీవుడ్ , బాలీవుడ్ ఇండస్ట్రీ లోని టాక్స్ వింటే అవుననే అనిపిస్తోంది. ప్రభాస్ తన రూమర్ గర్ల్ ఫ్రెండ్ కృతి తో ఏడూ అడుగులు వేయబోతున్నాడని త్వరలో వీరి ఎంగేజ్మెంట్ జరగబోతోందని జోరుగా గోసిప్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఊహాగానాలపై స్పందించిన ప్రభాస్ టీమ్ ఆ వాదనలను కొట్టిపారేసింది. కృతి , ప్రభాస్ తమ రాబోయే చిత్రం ఆదిపురుష్లో కలిసి నటించనున్నారు తప్ప అలాంటివేమీ లేవని తేల్చేసింది.

గతంలో సహనటుడు ప్రభాస్తో డేటింగ్ విషయాన్ని కృతి సనన్ ఖండించింది. ఇప్పుడేమో త్వరలో నిశ్చితార్థం చేసుకోనుందన్న పుకార్లు బాలీవుడ్ లో జోరుగా వినిపిస్తున్నాయి. సినీ క్రిటిక్ ఉమర్ సంధు ఈ రూమర్ కి ఆజ్యం పోసాడు . బ్రేకింగ్ న్యూస్ వారంలో ప్రభాస్ , కృతి సనన్ లు మాల్దీవుల్లో నిశ్చితార్థం చేసుకోనున్నారు ముందుగానే వారికి నా శుభాకాంక్షలు అని ట్విట్టర్ లో ట్వీట్ చేయడం తో ఈ రూమర్ మళ్లీ ప్రారంభమైంది.

ఆదిపురుష్ టీజర్ విడుదలైన తర్వాత కృతి ,ప్రభాస్ మధ్య డేటింగ్ రూమర్లు చెలరేగాయి. భేడియాలో కృతితో కలిసి పనిచేసిన వరుణ్ ధావన్, కృతి రేలషన్ గురించి మాట్లాడి నెట్టింట్లో సునామీ సృష్టించాడు. ఆ తర్వాత అయితే, తాను ప్రభాస్ పేరు చెప్పలేదు అని కవర్ చేసాడు. కృతి అప్పట్లో అలాంటి వాదనలను గట్టిగా కొట్టివేయగా, ఇప్పుడు ప్రభాస్ బృందం నిశ్చితార్థానికి సంబంధించిన వార్తలపై స్పందించింది. అతని బృందం ప్రభాస్ , కృతి కేవలం స్నేహితులు మాత్రమేనాని , వారి నిశ్చితార్థం గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు అని అన్నారు.
