Prabhas Project K : సాహో తర్వాత ప్రభాస్ పలు సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు కానీ తాజాగా శివరాత్రి వేడుకల్లో భాగంగా ప్రాజెక్టు కె నుంచి పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ లు కలిసి నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ K. ఈ చిత్రం జనవరి 12, 2024న థియేటర్‌లలో విడుదల కానుంది. మహాశివరాత్రి సందర్భంగా, సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో పాటు ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను తారలు షేర్ చేశారు.

దీపికా పదుకొణె ఈ పోస్టర్ తో పాటు “12.1.2024 ప్రాజెక్ట్ కె. హ్యాపీ మహాశివరాత్రి.”అని క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ తో పాటు ప్రాజెక్టు కే అప్డేట్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ బయోగ్రాఫికల్ డ్రామా మూవీ మహానటికి దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ K కి దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకొణె, ప్రభాస్‌ల కాంబినేషన్ లో వస్తున్న మొదటి ప్రాజెక్ట్.ప్రాజెక్ట్ కె తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.
దీపికా చివరిగా పఠాన్‌లో కనిపించింది. ఆమె హృతిక్ రోషన్‌తో కలిసి సిద్ధార్థ్ ఆనంద్ చిత్రం ఫైటర్‌లో కూడా కనిపించనుంది. ఈ నటి ఇటీవల తన భర్త రణవీర్ సింగ్ చిత్రం సర్కస్‌లో కరెంట్ లగా రే పాటలో అతిధి పాత్రలో కనిపించింది. ఇక ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె,ఆడిపురుష్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.