Prabhas Surgery : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ సినిమా తర్వాత చేసిన ‘సాహో’ కానీ.. ‘రాధేశ్యామ్’ కానీ ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ గురించి చాలా పుకార్లు షికారు చేస్తున్నాయి. సినిమాలు పెద్దగా ఫలితాన్ని అందుకోకపోవడంతో కాస్త మానసిక ఒత్తిడికి గురైన ప్రభాస్ మానసిక ప్రశాంతత కోసం స్పెయిన్ కు వెళ్ళాడనే వార్తలు రెండు మూడు వారాల క్రితం వచ్చాయి. అలాగే అక్కడ ప్రభాస్ తన మోకాలికి చిన్నపాటి ఆపరేషన్ చేయించుకున్నాడనీ కొన్ని రూమర్స్ వెలువడ్డాయి. మరి వీటిలో ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియదు కానీ యంగ్ రెబల్ స్టార్ సన్నిహితులు మాత్రం దీనిపై పెదవి విప్పలేదు. తాజాగా మరోమారు ప్రభాస్ సర్జరీ విషయమై ప్రచారం జోరందుకుంది.
Prabhas Surgery : కాలి సర్జరీ కోసం విదేశంలో ఉండటంతో రాలేకపోయాడు..
తాజాగా ప్రభాస్ సర్జరీ కోసం విదేశాలకు వెళ్లాడట. ఈ విషయంపై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ క్లారిటీ ఇచ్చారు. ప్రాజెక్ట్ కె సినిమా గురించి గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన సీతారామం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ ముఖ్య అతిథిగా రావాల్సి ఉందని.. కానీ కాలి సర్జరీ కోసం విదేశంలో ఉండటంతో రాలేకపోయాడని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు. దీంతో ప్రభాస్ నిజంగానే సర్జరీ కోసం విదేశాలకు వెళ్లినట్టు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ప్రాజెక్ట్ కెను వచ్చే ఏడాది అక్టోబర్ 18న విడుదలకు ప్లాన్ చేయాలని భావిస్తున్నట్లు అశ్వినీదత్ పేర్కొన్నారు. ఒకవేళ అప్పటికి కుదరకపోతే 2024 జనవరిలో రిలీజ్ చేస్తామని తెలిపారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోణ్ నటిస్తుండగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ప్రభాస్ కాలికి గాయం ఎప్పుడైందనే విషయంలో పెద్దగా ఎవరికీ క్లారిటీ లేదు. దీనిపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కొందరు ‘సాహో’ సమయంలో జరిగిందని చెబుతుంటే.. మరికొందరు ‘సలార్’ షూటింగ్ సమయంలో జరిగిందని అంటున్నారు. ఆ సమయంలో వెంటనే ఆపరేషన్ చేయించుకోమని డాక్టర్లు చెప్పకపోవడంతో ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ చిత్రాల షూటింగ్స్‌ను ప్రభాస్ పూర్తి చేశాడని, ఇప్పుడు కొంత సమయం చిక్కడంతో ఆపరేషన్‌కు వెళ్లాడని టాక్. ఆపరేషన్ అనంతరం ఎన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలనే దానిపై సైతం క్లారిటీ లేదు. మొత్తానికి ‘ప్రాజెక్ట్ కె’ మాత్రం 2024 జనవరిలోనే రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.