Premam Heroine : సినీ ఇండస్ట్రీ గాసిప్స్‌కి కొదవేమీ ఉండదు. నిజమెంతో.. అబద్ధమెంతో తెలుసుకునే సరికి జీవితాలై తల్లకిందులైపోతూ ఉంటాయి. అయితే ఇండస్ట్రీ ఒక పెద్ద మిస్టరీ. ఇక్కడ క్యాస్టింగ్ కౌచ్ ఎంత కామనో.. రిలేషన్స్ కూడా అంతే కామన్. కొన్ని మాత్రం గాసిప్స్ అయి ఉంటాయి. ఇక్కడ ఏ మచ్చా లేకుండా ఎదిగిన వాళ్లు బహుశా ఉండరేమో. ఇదంతా ఎందుకంటే తాజాగా ఓ హీరోయిన్‌తో తన భర్తకు రిలేషన్ ఉందని భావించిన ఓ హీరో భార్య ఆమెను నడిరోడ్డుపై ఉతికి పారేసింది. వెంటాడి మరీ అమ్మడిని ఉతికేయడం పలువురు చూస్తున్నా కూడా అంతా దానిని కెమెరాలలో బంధించడంలో బిజీ అయిపోయారు తప్ప ఈ ఉతుకుడు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు మాత్రం ఎవరూ ముందుకు రాలేదు.
Premam Heroine : ఇద్దరి మధ్య రిలేషన్ ఉందని బలంగా నమ్మిన భార్య
మరి ఆ హీరోహీరోయిన్ల మధ్య రిలేషన్ ఉందో లేదో స్పష్టంగా తెలియదు. కానీ నిప్పు లేనిదే పొగ రాదు అంటారు కదా.. భార్యకు అనుమానం వచ్చిందంటే పక్కాగా హీరో ప్రవర్తనలో మార్పు వచ్చిందన్న మాటేగా.ఇంతకీ ఆ హీరోహీరోయిన్లు ఎవరంటారా? ఆమె ఒడియా హీరోయిన్ ప్రకృతి మిశ్రా, హీరో బబుసన్ మెహంతి. ఈ ఇద్దరూ కలిసి ‘ప్రేమమ్’ సినిమాలో కలిసి నటించారు. ఆ తరువాత వీళ్లిద్దరి మధ్యచనువు పెరిగింది. తాజాగా ఉత్కల్ అసోసియేషన్ చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి వీళ్లిద్దరూ హాజరయ్యారు. అప్పటికే వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందని మెహంతి భార్య తృప్తి బలంగా నమ్మింది.
తన భర్తను ఆమె మాయచేసి బుట్టలో వేసుకుందని కొద్దిరోజులుగా మండిపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రకృతి మిశ్రా, బబుసన్ మెహంతిల జంట భువనేశ్వర్ నుంచి చెన్నై వెళుతుండగా.. వారి కారును అడ్డగించింది తృప్తి. కారులోకి ఎక్కి ప్రకృతి జుట్టుపట్టుకుని లాగింది. ఆమెపై దాడికి దిగింది. దీంతో తనకు దయచేసి సాయం చేయాలంటూ హీరోయిన్ అక్కడున్న వారిని అభ్యర్థించింది. కానీ వాళ్లు మాత్రం వీడియోలు తీయడంలో బిజీ అయిపోయారు. దీంతో ఎలాగోలా ఆమె నుంచి విడిపించుకుని కారు దిగింది ప్రకృతి. కానీ తృప్తి కూడా ఆమెను వెంబడించి మరీ ప్రకృతిపై దాడి చేసింది. ప్రస్తుతం ఈ వీడియోనెట్టింట వైరల్‌గా మారింది. పోలీసులు దీనిపై కేసు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.