Priyanka Chopra : బాలీవుడ్ బ్యూటీ , అందాల సుందరి ప్రియాంక చోప్రా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు బాలీవుడ్ ను ఏలిన ఈ చిన్నది ఇప్పుడు హాలీవుడ్ లో తన హవాకు కొనసాగిస్తోంది.పెళ్లైనప్పటి నుంచి ఈ బ్యూటీ భర్త నిక్ జోనస్ , ఆమె కూతురు మాల్టీ తో కలిసి విదేశాల్లోనే ఉంటోంది. అక్కడే ఫ్యామిలీని సెట్ చేసిన ఈ చిన్నది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ సందడి చేస్తుంటుంది. తాజాగా ప్రియాంక సోషల్ మేడలో షేర్ చేసి ఓ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది.

లాస్ వెగాస్‌లో జోనాస్ బ్రదర్స్ కచేరీకి హాజరై రచ్చ రచ్చ చేసింది ప్రియాంక . భర్త నిక్ వేదికపై ప్రదర్శన ఇస్తుండగా, ఆమె ప్రేక్షకుల మధ్య నిలుచుని ప్రదర్శనను ఆస్వాదించడమే కాకుండా, భర్త నిక్ జోనాస్‌ను ఉత్సాహపరిచింది. ఓ అభిమాని ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోలో ప్రియాంక పూర్తిగా మైమరచిపోయి మరి సంగీతం లో మునిగి తేలుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

అంతే కాదు నిక్ జోనాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక చోప్రాతో దిగిన పిక్స్‌ని ను పోస్ట్ చేసాడు. సంగీత కచేరీ నుండి కొన్ని సోలో చిత్రాలను పంచుకున్నాడు . ఈ పిక్స్ తో పాటుగా హార్ట్ షేప్ ఇమేజిని జత చేసి “వెగాస్ విత్ యు” అని క్యాప్షన్ ఇచ్చాడు నిక్ . ఇక ప్రియాంక కూడా ఈ పిక్స్ ను పోస్ట్ చేసి , “నేను ఎగరడానికి కావాల్సిన రెక్కలు మీరే” అని కాప్షన్ అందించింది.

ఈ కన్సర్ట్ కోసం ప్రియాంక మెరిసేటి నల్లటి దుస్తులు ధరించి, ఆ డ్రెస్ ను బ్లాక్ ఫెదర్ తో చేసిన ఓవర్‌కోట్‌తో జత చేసింది. నిక్ కన్సర్ట్ కోసం బ్లాక్ కో-ఆర్డ్ సెట్ వేసుకుని ఆమెను మ్యాచ్ చేసాడు.

రీసెంట్ గా ప్రియాంక చోప్రా తన కుమార్తె మాల్టీ మేరీ చోప్రా జోనాస్ అందమైన చిత్రాలను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో పంచుకుని అభిమానులను ఆకట్టుకుంది.

నెట్టింట్లో షేర్ చేసిన రెండు ఫోటోలు వైరల్ అయ్యాయి. మొదటి చిత్రంలో, ప్రియాంక సెల్ఫీని క్లిక్ చేస్తున్నప్పుడు మాల్టీ మేరీని తన చేతుల్లో పట్టుకుంది. రెండో ఫోటోను
వారు పడుకునే సమయంలో తీశారు.
