Priyanka Nick : ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్టార్ జంటలలో ప్రియాంక చోప్రా , నిక్ జోనాస్ ఉన్నారు. ఈ క్రాస్ కాంటినెంటల్ నటి ప్రియాంక అమెరికన్ పాప్ స్టార్ నిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా తమ ప్రొఫెషనల్ విషయాలతో పాటు పర్సనల్ విషయాలను, ఫ్యామిలీ సంగతులను ఈ జంట పంచుకోవడానికి ఏమాత్రం వెనకాడరు. తాజాగా ఈ లవ్ బర్డ్స్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ ప్రస్తుతం అందరి మనసులను దోచేస్తున్నాయి. మంచుకొండల్లో ప్రేమ పక్షులు తమ చిన్నారితో కలిసి ఎంజాయ్ చేసిన హాలిడే మూమెంట్స్‌ను పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ప్రియాంక చోప్రా , నిక్ జోనాస్ ఇటీవల యుఎస్‌లోని కొలరాడోలోని ఆస్పెన్‌లో స్కీ వెకేషన్ ను ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఈ ప్రేమ జంట హాలిడే వెకేషన్‌కు తమ కుమార్తె మాల్టీ మేరీ చోప్రా జోనాస్‌ను కూడా తమ వెంట తీసుకువెళ్లారు. ఈ హాలిడే ట్రిప్‌లో ఈ కపుల్ స్నేహితులు పాలుపంచుకున్నారు.

ఈ ట్రిప్‌కు సంబంధించిన పిక్స్‌ను నిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా షేర్ చేశాడు. నిక్, ప్రియాంక ,మాల్టీ ముగ్గురు కలిసి దిగిన ఫ్యామిటీ ఫోటో అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. నిక్ ప్రియాంక చోప్రా చుట్టూ తన చేతిని ఉంచాడు, ప్రియాంక తన పాప మాల్టీని ఆమె చేతుల్లో పట్టుకుంది. వాళ్ల వీపు కెమెరాకు ఎదురైంది. ఇక మరోపిక్లో నిక్, ప్రియాంక ఒకరినొకరు ఆలింగనం చేసుకుని మంచు మీద పడుకున్నారు. ఈ చిత్రం కూడా హైలెట్‌గా నిలుస్తోంది.

ఈ హాలిడే వెకేషన్ కోసం చిన్నారితల్లి మాల్టీ తెలుపు , గులాబీ రంగుల్లో ఉన్న దుస్తులను ధరించగా, ప్రియాంక, నిక్ లు నలుపు ,తెలుపు స్కీ దుస్తులు ధరించారు.

మరో ఫోటోలో రెడ్ బీనీ ధరించి ఉన్న ప్రియాంక నిక్ పై సరదాగా స్నో బాల్ విసిరింది. బైక్‌పై పోజులిచ్చిన ప్రియాంక కెమెరాకు చిక్కిన సోలో చిత్రం కూడా ఈ పిక్స్ లో ఉంది . నిక్ తన స్నేహితుల స్కీ ఔటింగ్ నుండి కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

ఇటీవల, జోనాస్ బ్రదర్స్ లాస్ ఏంజిల్స్‌లో హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్‌ను అందుకున్నారు. వారు తమ సంగీత వృత్తిని ప్రారంభించిన దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఈ గౌరవం వారికి లభించింది. ఈ ఈవెంట్లో ప్రియాంక మొదటి సారి పబ్లిక్ గా మాల్టీ మేరీ ముఖాన్ని ప్రపంచానికి చూపించింది. నెటిజన్లు మాల్టీని చూసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
