Project K : పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ తదుపరి చిత్రం ప్రాజెక్ట్ కె నుంచి ఓ తాజాగా అప్డేట్ వచ్చింది. సైన్స్ ఫిక్షన్, యాక్ష్ డ్రామా నేపథ్యంలో చిత్రీకరిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. ఈ చిత్రం మొదటి భాగాన్ని 2024లో ఏప్రిల్ నెలలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రభాస్‌తో రొమాన్స్ చేయనుంది. ఇక సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక ప్రాత్ర పోషించనున్నారు.

సావిత్ర బయోపిక్ అయిన మహానటి మూవీ ద్వారా మంచి పేరును సంపాదించుకున్న నాగ్ అశ్విన్ ప్రభాస్ తో చేస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా ప్రాజెక్ట్ కె. ఇక దీపికా పదుకొనె ప్రభాస్‌తో చేస్తున్న మొదటి సినిమా కావడంతో మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి. మీడియా కథనాల ప్రకారం ప్రాజెక్ట్ కె ను రెండు భాగాలుగా విడుదల చేయాలని మూవీ యూనిట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రజెక్ట్ కె విజన్ చాలా పెద్దది అందుకే మేకర్స్ దీనిని రెండు భాగాలుగా రూపొందించాలనుకున్నారు. బాహుబలి చిత్రం మాదిరిగానే మొదటి భాగంలో ఇంట్రడక్షన్ ఇచ్చి రెండో భాగంలో డ్రామాను చూపిస్తారని తెలుస్తోంది. ప్రాజెక్ట్ కె ను సినీ ఇండస్ట్రీలో అతి భారీ భారతీయ సినిమాగా తెరముందుకు తీసుకురాన్నారు చిత్ర నిర్మాతలు. ఇటీవలె చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ ఇంట్రడక్షన్స్ సీన్స్ సహా, మొదటి షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసినట్లు తెలిపారు. ఆ సీన్స్‌లో ప్రభాస్ చాలా కూల్‌గా కనిపిస్తున్నాడు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ ప్రాజెక్టును వైజయంతీ ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

గత ఏడాది మార్చిలో డైరెక్టర్ అశ్విన్ ట్విట్టర్ వేదికగా సినిమాకు తగ్గట్లుగా లగ్జరీ బడ్జెట్‌తో ఫ్యూచరిస్టిక్ వాహనాలను నిర్మించడంలో తమకు మద్దతు ఇవ్వమని ఆనంద్ మహీంద్రాను కోరారు. మహీంద్రా మద్దతును కోరుతూ ఆనంద్ సార్ నేను మిమ్మల్ని చాలా ఆరాధిస్తున్నాను, మనకు ప్రతిభావంతులైన, నైపుణ్యం కలిగిన భారీతయ ఇంజనీర్లు, డిజైనర్ల బృందం ఉంది, అందుకే ప్రాజెక్ట్ కె ద్వారా ఇంతకు ముందెన్నడూ ఎవరూ ప్రయత్నించని విధంగా ప్రాజెక్ట్ కె స్థాయిని పెంచడంతో పాటు భారతీయుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో మీరు మాకు సహాయం చేయగలిగితే అతి దేశం గర్వించదిగినదిగా ఉంటుందన్నాడు.