Puja Hegde : పూజా హెగ్డే.. నక్కను తొక్కి ఇండస్ట్రీలో అడుగు పెట్టిందో ఏమో కానీ స్టార్ హీరోయిన్‌గా ఎదగడానికి పెద్దగా టైమ్ పట్టలేదు. అందం, అభినయం రెండూ తోడైతే పూజా హెగ్డే అన్నట్టుగా మారిపోవడంతో ఈ బ్యూటీకి తిరుగులేకుండా పోయింది. ఇటీవలి కాలంలో అమ్మడి ఖాతాలో ఫ్లాపులు పడుతున్నా క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. దీంతో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అన్న బేధం లేకుండా ఆఫర్లు మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ ముద్దుగుమ్మ మూవీస్‌లో కనిపించి కనువిందు చేసేది. తాజాగా లైవ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి కుర్రాళ్ల గుండెల్లో గునపాలు గుచ్చేసింది. యూత్‌కి పూనకాలు తెప్పించింది.
Puja Hegde : డీజే సినిమాతో పెరిగిన రేంజ్
కోలీవుడ్ ద్వారా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పూజా హెగ్డే తెలుగులో 2014లో నాగ చైతన్య హీరోగా రూపొందిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ తరువాత వచ్చిన డీజే సినిమాతో అమ్మడి రేంజ్ పెరిగిపోయింది. తెలుగు ప్రేక్షకులు సైతం ఈ పొడుగు కాళ్ల సుందరికి జేజేలు పలకడంతో స్టార్ హీరోలందరి సరసన వరుస అవకాశాలు వచ్చాయి. ఇక ఇప్పటి వరకూ సిల్వర్ స్క్రీన్‌పైనే అలరించిన ఈ బ్యూటీ తాజాగా ఓ అవార్డు ఫంక్షన్‌లో పాపులర్ తెలుగు సాంగ్స్‌కి డ్యాన్స్ వేసి పూనకాలు తెప్పించింది. అమ్మడు డ్యాన్స్ చూసి ప్రేక్షకులు విజిల్స్, అరుపులతో ఆడిటోరియం మొత్తాన్ని గడగడలాడించారు.
రాములో రాములా.. బుట్ట బొమ్మ.. బుట్ట బొమ్మా.. సీటీమార్ లాంటి పాటలకు స్టెప్పులను అదరగొట్టేసింది. ఇక స్టార్ హీరో విజయ్ చేసిన అరబిక్ కుతు డ్యాన్స్‌ను కూడా ఇరగదీసింది. దీంతో ఆడియెన్స్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. మెడ్లీ తీసుకుని ఈ రేంజ్‌లో అమ్మడు స్టెప్పులు ఇరగదీస్తుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయని ఆడియన్స్ అవాక్కయ్యారు. కంటిన్యూగా ఓ 10 నిమిషాల పాటు పూజ వేసిన డ్యాన్స్ చేసి మెస్మరైజ్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోకు వ్యూస్, లైక్స్, కామెంట్స్ వెల్లువెత్తున్నాయి. మొత్తానికి అమ్మడు టాలెంటెడే.