Puja Hegde : ముంబై ముద్దుగుమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నది.. చూడే నా కళ్లు’ అంటూ ‘అల వైకుంఠపురము’లో పూజా కాళ్లను వర్ణిస్తూ అల్లు అర్జున్ పాడిన పాట ఎంత వైరల్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. ఈ పాట రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టింది. ఇక ఈ ముద్దుగుమ్మ తన అందమైన కాళ్లను ప్రదర్శించేందుకు ఏమాత్రం ఆలోచించదని తెలిసిందే. అది వెకేషన్ అయినా.. సినిమా అయినా.. అస్సలు తగ్గేదేలే అంటుంది. తాజాగా పబ్లిక్‌లో అమ్మడు అందమైన కాళ్లను చూపిస్తూ ఓ రేంజ్‌లో షో చేసింది. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విదేశీ వీధుల్లో జీన్స్ షార్ట్ ధరించి థైస్ చూపిస్తూ.. పబ్లిక్‌లో పూజా బోల్డ్ నెస్‌తో రెచ్చిపోయింది. ఇలా ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోల్లో పూజా కాళ్ల పైనే అందరూ ఫోకస్ చేస్తున్నారు. ఈ కాళ్లను చూసిన కుర్రకారు.. ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే మా కళ్లు’ అంటూ సాంగేసుకుంటూ.. కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. 2012లో అమ్మడు చేసిన తొలి సినిమా ‘ముగమూడి’. కానీ ఈ సినిమా అమ్మడికి పెద్ద క్రేజ్ తీసుకు రాలేదు. ఆ తర్వాత తెలుగులో ఒక లైలా కోసం, ముకుందా అనే సినిమాలు కూడా చేసింది. ఈ సినిమాలు కూడా ఈ బ్యూటీకి అంతంత మాత్రంగానే పేరు తెచ్చాయి.
Puja Hegde : అక్కడి నుంచి హిట్స్ ప్రారంభం..
అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా మాత్రం అమ్మడికి తొలి హిట్టు ఇచ్చి అక్కున చేర్చుకుంది. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సాక్ష్యం సినిమా చేసింది. ఇదొక పెద్ద డిజాస్టర్. ‘అరవింద సమేత వీర రాఘవ సినిమా’ నుంచి పూజాకు హిట్స్ ప్రారంభమయ్యాయి. ఇక అమ్మడు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస హిట్స్‌తో అమ్మడి రేంజ్ ఆకాశాన్నంటింది. ఇంత కాలానికి మళ్లీ.. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు దారుణమైన ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాయి. అయినా అమ్మడికి అవకాశాలేమీ తగ్గట్లేదు. ‘జనగణమన’ మూవీలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా ఎంపికైంది. ఇక అమ్మడు తాజాగా వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. అయినా సరే.. ఫోటో షూట్‌లు చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.