Pune : మహారాష్ట్రలోని పూణె లో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే మంత్రగాడి మాయలో పడి , తమ కోడలికి ఎలాగైనా పిల్లలు పుట్టాలన్న ఉద్దేశంతో మహిళకు ఆమె అత్తమామలు, భర్త బలవంతంగా మానవుల ఎముకల పొడిని తినిపించారు. ఈ సంఘటనలు జీర్ణించుకోలేని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె భర్త , అత్తమామలు, క్షుద్రపూజలు చేసే వారితో సహా ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

పుణె సిటీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుహైల్ శర్మ మాట్లాడుతూ, పోలీసులు మూఢనమ్మకాల నిరోధక చట్టం మేరకు సెక్షన్ 3తో పాటు ఐపిసి సెక్షన్ 498 ఎ, 323, 504, 506 కింద కేసు నమోదు చేశారన్నారు . అమానవీయ, అఘోరీ పద్ధతులు మరియు బ్లాక్ మ్యాజిక్ చట్టం, 2013 కింద ఏడుగురిపై కేసు నమోదు అయ్యింది.

వార్తా సంస్థ ANI ప్రకారం, మహిళ వేర్వేరు విషయాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.మొదటి కేసులో, తన అత్తమామలు పెళ్లి సమయంలో నగదు, బంగారు మరియు వెండి ఆభరణాలు సహా కట్నం డిమాండ్ చేశారని ఆరోపించింది.రెండవ కేసులో, ఫిర్యాదు దరఖాస్తు ప్రకారం, పోలీసులు మూఢనమ్మకాల నిరోధక మరియు చేతబడి చట్టం యొక్క సంబంధిత సెక్షన్లను విధించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రెండవ కేసులో, అనేక అమావాస్య రాత్రులలో, మహిళ యొక్క అత్తమామలు ఆమెను ఇంట్లో క్షుద్ర పూజల్లో పాల్గొనమని బలవంతం చేశారని, ఆచారాల పేరుతో తనను తెలియని శ్మశానవాటికకు బలవంతంగా తీసుకెళ్లారని ఆరోపించింది .మరియు
పిల్లల కోసం చనిపోయిన మనిషి యొక్క ఎముకల పొడిని తినమన్నారని పేర్కొంది.

మరో రకమైన ఆచారంలో అత్తమామలు బాధితురాలిని మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలోని ఏదో తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారని, అక్కడ ఆమె జలపాతం కింద “అఘోరీ” (బ్లాక్ మ్యాజిక్) ప్రాక్టీస్‌లో బలవంతంగా పాల్గొనేలా చేశారని డిసిపి శర్మ తెలిపారు. ఈ అభ్యాసాల సమయంలో, వారు వీడియో కాల్స్ ద్వారా ఫోన్‌లో క్షుద్ర పూజలు చేసే వారి నుంచి సూచనలను కూడా తీసుకున్నారన్నారు. మహిళ
ఫిర్యాదును తీవ్రంగా పరిగణిస్తూ ఏడుగురు నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని డీసీపీ శర్మ తెలిపారు.