టాలీవుడ్ టాప్ స్పీడ్ డైరెక్టర్స్ లో పూరి జగన్నాథ్ ముందు వరుసలో ఉంటారు. జెట్ స్పీడ్ కు బ్రాండ్ అంబాసిడర్. అలాంటి దర్శకుడి ని రేస్ లో వెనుకపడేలా చేసింది కరోనా. లైగర్ రెండేళ్ల షూటింగ్ తరువాత పూర్తైంది. కాని రిలీజ్ కోసం ఆగస్ట్ 25 వరకు వెయిట్ చెయ్యాల్సిందే. అంటే దాదాపు ఆరు మాసాల సమయం ఉంది. అందుకే నెక్ట్స్ మూవీ స్టార్ట్ చేస్తున్నాడు పూరి.
పూరి జగన్నాథ్ చేతిలో జనగణమన అనే పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ గా ఉంది. చాలా కాలం క్రితమే సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో తీయాలనుకున్న సినిమా . ఇప్పుడు అతని ఫ్యాన్ విజయ్ దేవరకొండతో మూవీ చేయబోతున్నాడు.పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం తో జాన్వి కపూర్ డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం జనగణమన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతోందని తెలుస్తుంది.
ఆగస్ట్ 25న లైగర్ పూర్తి అయ్యే నాటికి,జనగణమన షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇదే ఏడాది జనగణమన కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు లైగర్ కోసం పొడవాటి జుట్టుతో కనిపించిన విజయ్.. జనగణమన కోసం మిలట్రీ హెయిర్ కట్ లోకి మారిపోనున్నాడని సమాచారం. ఆ లుక్ టెర్రిఫిక్ గా ఉండనుందని చిత్ర యూనిట్ చెప్పుకొస్తోంది.