Puri and Charmi : పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే టాలీవుడ్‌కు వచ్చి హీరోయిన్‌గా రాణించింది. చాలా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా ఆమె నటించి మెప్పించింది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్‌తో కలిసి నిర్మాతగా మారింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఆమె.. ఇప్పుడు నిర్మాతగా ఎదిగిందంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లైగర్ మూవీకి సైతం ఆమె నిర్మాతగా ఉంది. పూరి కనెక్ట్స్ పేరుతో సినిమాలు చేస్తోంది.
ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో పూరి-ఛార్మిల మధ్య ఏదో ఉందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారానికి ఎప్పుడూ బ్రేక్ పడింది కూడా లేదు. అసలు ఈ కారణంగానే ఛార్మి ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని వార్తలు సైతం వస్తున్నాయి. ఇప్పటి వరకైతే పెద్దగా వీరిద్దరూ ఈ విషయమై స్పందించలేదు కానీ.. తాజాగా పూరి మాత్రం ఓ ఇంటర్వ్యూలో అసలు నిజాన్ని వెల్లడించారు. తనకూ ఛార్మికి మధ్య స్నేహం తప్ప మరే రిలేషన్ షిప్ లేదని ఆయన తెలిపారు.
Puri and Charmi : అఫైర్ ఉన్నా అది ఎక్కువ రోజులు నిలబడదు..
‘ఛార్మీ 13 ఏళ్ల వయసప్పటి నుంచి నాకు తెలుసు. కొన్ని దశాబ్దాలుగా ఆమెతో కలిసి పనిచేస్తున్నా. ఛార్మీకి నాకు ఏదో అఫైర్ ఉందని ఏదేదో మాట్లాడుకుంటారు. ఆమె ఇంకా యంగ్‌గా ఉండటం వల్లే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అదే ఛార్మికి 50 ఏళ్లు ఉంటే ఇలా మాట్లాడేవారు కాదు కదా. ఆమెకు వేరేవాళ్లతో పెళ్లి జరిగినా పట్టించుకునేవారు కాదు. కానీ తామిద్దరం ఒకే ఇండస్ట్రీలో ఉండటం, ఎన్నో సంవత్సరాలుగా ట్రావెల్ అవుతుండటంతో ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. ఒకేవళ అఫైర్ ఉన్నా అది ఎక్కువ రోజులు నిలబడదు. ఆకర్షణ అనేది కొన్ని రోజుల్లోనే చచ్చిపోతుంది. స్నేహమే శాశ్వతం. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్’ అంటూ పూరి వెల్లడించారు. మరి ఇప్పటికైనా ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో వేచి చూడాలి.