రష్మిక మందన్నా.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తనదైన టాలెంట్తో తక్కువ కాలంలోనే స్టార్ హోదాను పొందిన ఈ కన్నడ పిల్ల.. నేషనల్ లో కూడా గుర్తింపు పొంది భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. అటువంటి రష్మికను స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్టేజ్పైనే అవమానించేసారు. ఇక వివరాల్లోకి వెళ్తే..
శర్వానంద్ రష్మిక మందన్నా తొలిసారి జంటగా నటించిన తాజా సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్లు
. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్ ఖుష్బు సుందర్ ఊర్వశి కీలక పాత్రలను పోషించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించారు.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీ మార్చి 4న తేదీనా గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేరక్స్ నిన్న సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఆడవాళ్ళు మీకు జోహార్లు
ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు డైరెక్టర్ సుకుమార్ సాయి పల్లవి కీర్తి సురేష్ స్పెషల్ గెస్ట్లుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా సుకుమార్ స్టేజ్పై మాట్లాడుతూ.. సాయి పల్లవి, కీర్తి సురేష్, సమంతపై సైతం ప్రశంసల వర్షం కురిపించారు. తరువాత అక్కడే ఉన్న రష్మికని నీ పేరేంటి? అని సుకుమార్ ప్రశ్నించి అందరినీ ఆశ్చర్య పోయేలా చేసాడు. మళ్ళీ వెంటనే రష్మిక మందన్నా అంటూ ఆయనే చెప్పి.. ఆమె గొప్ప నటి అంటూ పొగిడేశారు దీనితో అందరు నవ్వుకున్నారు.
కానీ రష్మికతో పుష్ప
వంటి పాన్ ఇండియా సినిమా చేసిన సుకుమార్ ఆమె పేరే మరచిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపొయింది. దీనితో రష్మిక ఫ్యాన్స్ ఆయన్ను సోషల్ మీడియా వేదికగా ఏకేస్తూ ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియో కూడా నెట్టింటిలో వైరల్ అవుతుంది.